Kangana Ranaut : కంగన రనౌత్! సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే తన దూకుడుతో లెక్కలేనన్ని వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడామె రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా తన ఘాటు వ్యాఖ్యలు, విమర్శలతో నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ వక్రీకరించిన ఒక ఫొటోను షేర్ చేసింది.
Kangana Ranaut…
ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి కంగనకు బిగ్ ఝలక్ తగిలింది. ఆమెపై ఏకంగా 40 కోట్ల పరువునష్టం దావా పడింది. ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంటులో కుల గణనపై ఉపన్యసించారు. దీనికి కౌంటర్ గా కంగనా ఎడిట్ చేసిన ఫోటోను షేర్ చేసింది. మూడు మతాలు ప్రతిబింబించేలా ఆ ఫొటోను ఎడిట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటో కాస్తా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో పాటే కాంగ్రెస్ నాయకులకు కోపం వచ్చేలా చేసింది.
Also Read : Hari Hara Veera Mallu : పవర్ స్టార్ ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్