Emergency : హైదరాబాద్ – భారత దేశ చరిత్రలో చీకటి రోజు అప్రకటిక ఎమర్జెన్సీ(Emergency). ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. దానిని నిర్బంధంగా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకే దక్కుతుంది. ఆమె తీసుకున్న నిర్ణయం కోట్లాది మందికి కోపం తెప్పించేలా చేసింది. దెబ్బకు తనను జైలుపాలు చేసేలా చేసింది. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మార్గదర్శకత్వంలో జనతా సర్కార్ కొలువు తీరింది.
Kangana Ranaut Emergency Movie..
ఆనాటి చీకటి రోజుల గురించి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఎమర్జెన్సీ చిత్రం ద్వారా. ఇక భారతీయ జనతా పార్టీకి గొంతుకగా ఉన్న ఎంపీ, ప్రముఖ లేడీ యాక్టర్ కంగనా రనౌత్ ఆనాటి ఇందిరా గాంధీ పాత్రలో లీనమై పోయి నటించారు. ఆ పాత్రకు జీవం పోశారు. ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
1975 జూన్ 25 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా దీనిని తీశారు. జేపీ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ నటించారు. అటల్ జీ పాత్రలో శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా, తదితరులు ఇతర కీలక పాత్రలలో ఒదిగి పోయారు. లీడ్ రోల్ లో నటిస్తూనే మరో వైపు డైరెక్టర్ గా అవతారం ఎత్తింది కంగనా రనౌత్. సంజయ్ గాంధీగా విశాక్ నాయర్ నటించాడు.
Also Read : Hero Pawan Kalyan Movie : హరి హర వీర మల్లు ‘మాట వినాలి’ సాంగ్ రిలీజ్