Kangana Ranaut: నా ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడం లేదు – కంగనా రనౌత్‌

నా ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడం లేదు - కంగనా రనౌత్‌

Kangana Ranaut: బాలీవుడ్ అగ్ర న‌టి, ఎంపీ కంగ‌నా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటిస్తున్న తాజా సినిమా ‘ఎమర్జెన్సీ’. స్వతంత్ర్య భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమెర్జెన్సీ నాటి పరిస్థితులు ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా(Kangana Ranaut) కనిపించనుంది. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జీ స్టూడియోస్‌ సంస్థతో కలిసి కంగనా స్వంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ సినిమాను సెప్టెంబరు 6న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

Kangana Ranaut Comment

అయితే తమ సినిమాకి సెన్సార్‌ బోర్డ్‌ ఇంకా సర్టిఫికేట్‌ ఇవ్వలేదంటూ కంగన(Kangana Ranaut) సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో అధికార పార్టీలో ఉన్న బీజేపీ ఎంపీ అయి ఉండి, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన కంగనా సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడమా అంటూ అభిమానులు అవాక్కవుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కంగనా మాట్లాడుతూ…
‘‘త్వరలోనే మా సినిమా సెన్సార్‌ పూర్తి అవుతుందని ఆశిస్తున్నా. మేం సర్టిఫికేట్‌ కోసం వెళ్లిన రోజు కొంత మంది డ్రామా క్రియేట్‌ చేశారు. సెన్సార్‌ బోర్డులోనూ చాలా సమస్యలు ఉన్నాయి. అనుకున్న సమయానికి మా సినిమా విడుదల కావాలని కోరుకుంటున్నా. సెన్సార్ సర్టిఫికేట్‌ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నా. కానీ, వాళ్లు సర్టిఫికేట్‌ ఇవ్వడం లేదు. నా సినిమా కోసం నేను పోరాటం చేయడానికి సిద్ధం. ఇందు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా’’ అని కంగన తెలిపారు. ఈ సినిమా విషయంలో చిత్రబృందానికి వస్తోన్న బెదిరింపులను ఉద్దేశించి కంగనా మాట్లాడుతూ… ‘‘మమ్మల్ని బెదిరించినంత మాత్రాన చరిత్ర ఏమీ మారిపోదు’’ అని అన్నారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 6న ఇది విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో తమని తప్పుగా చూపించారని ఒక వర్గం వారు ఆరోపించారు. ఈ సినిమా రిలీజ్‌పై బ్యాన్‌ విధించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే చంపేస్తామంటూ కంగనకు బెదిరింపులు వచ్చాయి. ఇందులో సంజయ్‌ గాంధీగా నటించిన విశాక్‌ నాయర్‌ సైతం తాజాగా బెదిరింపులు ఎదుర్కొన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే పాత్ర పోషించానని భావించి కొంతమంది నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. చంపేస్తామంటూ కొన్ని రోజులుగా సందేశాలు వస్తున్నాయి. నేను చెప్పేది ఒక్కటే.. ఇందులో నేను సంజయ్‌ గాంధీ రోల్‌ పోషించా. ఒక్కసారి క్రాస్‌ చెక్‌ చేసుకోవాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు.

Also Read : Committee Kurrollu: ఓటీటీలోనికి ‘కమిటీ కుర్రోళ్ళు’ ! స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

emergencyKangana Ranaut
Comments (0)
Add Comment