Kangana Ranaut: బాలీవుడ్‌ పార్టీలపై కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు !

బాలీవుడ్‌ పార్టీలపై కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు !

Kangana Ranaut: వేదిక ఏదైనా నిర్మొహమాటంగా అభిప్రాయాలు పంచుకొవడంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్‌ ఒకరు. ఇప్పటికే ఎన్నోసార్లు బాలీవుడ్‌ పై అసంతృప్తితో మాట్లాడిన ఆమె తాజా ఇంటర్వ్యూలోనూ ఆ చిత్ర పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో మీకు ఫ్రెండ్స్‌ ఉన్నారా ? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ… ‘‘నేను బాలీవుడ్‌కు సెట్‌ అయ్యే వ్యక్తిని కాదు. అందుకే నాకు ఇక్కడ స్నేహితులు లేరు. వాళ్లందరి లైఫ్‌ స్టైల్‌ వేరు. నాది వేరు. షూటింగ్స్‌ లేకపోతే… ఉదయం జిమ్‌ చేయడం, మధ్యాహ్నం నిద్రపోవడం, మళ్లీ సాయంత్రం కసరత్తులు చేయడం, టీవీ చూడడం, పడుకోవడం ఇదే వారి దినచర్య. అంతకుమించి వారికేం తెలియదు.

Kangana Ranaut Comment

అలాంటి వారితో స్నేహం ఎలా చేయగలను? సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎప్పుడూ వాళ్ల దుస్తులు, విలువైన వస్తువుల గురించే మాట్లాడుకుంటుంటారు తప్ప మరో విషయాన్ని పట్టించుకోరు. వీటికి భిన్నంగా ఆలోచించే వ్యక్తి బాలీవుడ్‌లో కనిపిస్తే ఆశ్చర్యమే’’ అని వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌లో జరిగే పార్టీలపై నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut) స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇండస్ట్రీలో జరిగే పార్టీల గురించి మాట్లాడుతూ.. అక్కడ వారు మాట్లాడుకునే మాటలు తనకు చాలా ఇబ్బంది కలిగిస్తాయని, తన కోణంలో బాలీవుడ్‌ పార్టీలంటే ‘ఓ ట్రామా’ అని పేర్కొన్నారు.

సినిమాల విషయానికొస్తే.. కంగ‌నా రనౌత్(Kangana Ranaut) నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. స్వతంత్ర్య భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమెర్జెన్సీ నాటి పరిస్థితులు ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించనుంది. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. కంగనా స్వంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఎమర్జెన్సీ” సినిమా నిర్మాణం, దర్శకత్వం, ఇందిరా గాంధీ పాత్రల బాధ్యతలను తానే స్వయంగా తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబ‌ర్‌ 6 న థియేట‌ర్ల‌లోకి తీసుకురానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను తాజాగా విడుద‌ల చేశారు.

Also Read : Bunny Vas : నిర్మాతల్లో ఐక్యత ముఖ్యం అంటున్న బన్నీ వాస్

BollywoodKangana RanautMP Kangana Ranaut
Comments (0)
Add Comment