Kangana Ranaut: ఇందిర తో కంగనా రనౌత్ చిట్ చాట్ !

ఇందిర తో కంగనా రనౌత్ చిట్ చాట్ !

Kangana Ranaut: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షుకులను అలరించడమే కాకుండా, సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. భాతర అత్యున్నత పౌర పురస్కారం పద్మ శ్రీ తో పాటు నాలుగు నేషనల్ అవార్డులు, ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. స్వతంత్ర్య భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమెర్జెన్సీ నాటి పరిస్థితులు ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించనుంది.

కంగనా స్వంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఎమర్జెన్సీ” సినిమా నిర్మాణం, దర్శకత్వం, ఇందిరా గాంధీ పాత్రలను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన కంగనా… తాజాగా ఇందిరతో ముచ్చటిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ గా మారుతోంది.

Kangana Ranaut – ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇందిర తో కంగనా ముచ్చట్లు

అవకాశం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కంగనా రనౌత్(Kangana Ranaut)… దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తో కలిసి ఎదురెదురుగా కూర్చొని ముచ్చటిస్తున్నట్లు ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇందిర గాంధీని సృష్టించి ఆమెతో చిట్ చాట్ చేస్తున్నట్లు ఉన్న ఈ ఫోటోకు…. ‘ఐజీ(ఇందిరా గాంధీ)తో చాట్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ ఆమె కామెంట్ పెట్టింది. ఇది అచ్చం ఇందిరా గాంధీతో ముచ్చటిస్తున్నట్లు ఉండటంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

‘మణికర్ణిక’ తర్వాత కంగనా దర్శకత్వం వహిస్తున్న సినిమా “ఎమర్జెన్సీ”. ఈ సినిమాకు నిర్మాతగా, దర్శకురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కంగనా… ఒక సందర్భంలో ఈ సినిమా కోసం తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. తన డెబ్యూ ఫిల్మ్ గ్యాంగ్ స్టర్ తో ఇండియన్ గ్లోబల్ ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకున్న కంగనా… ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక, పంగ, వంటి సినిమాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. తాజాగా ఆమెను కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.

Also Read : Ram Gopal Varma: ‘వ్యూహం’ నిర్మాత పుట్టిన రోజు వేడుకల్లో ఆర్జీవి

emergencyKangana Ranaut
Comments (0)
Add Comment