Emergency: కంగ‌నా రనౌత్ ‘ఎమ‌ర్జెన్సీ’ ట్రైల‌ర్‌ వచ్చేసింది !

కంగ‌నా రనౌత్ ‘ఎమ‌ర్జెన్సీ’ ట్రైల‌ర్‌ వచ్చేసింది !

Emergency: బాలీవుడ్ అగ్ర న‌టి, ఎంపీ కంగ‌నా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ(Emergency)’. స్వతంత్య్ర భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమెర్జెన్సీ నాటి పరిస్థితులు ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించనుంది. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. కంగనా స్వంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఎమర్జెన్సీ” సినిమా నిర్మాణం, దర్శకత్వం, ఇందిరా గాంధీ పాత్రల బాధ్యతలను తానే స్వయంగా తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబ‌ర్‌ 6 న థియేట‌ర్ల‌లోకి తీసుకురానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను తాజాగా విడుద‌ల చేశారు.

Emergency Movie Updates

అయితే ఈ మూవీ ట్రైల‌ర్‌ను చూస్తుంటే సినిమా విడుద‌ల‌య్యే స‌మ‌యానికి ఈ చిత్రం యుట్టూ చాలా వివాదాలే చుట్టుముట్టేలా ఉన్నాయి. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా అమ‌లు జేసిన ప్ర‌త్యేక‌ చ‌ట్టాలు, తీసుకున్న నిర్ణ‌యాలు, సంజ‌య్ గాందీ ఎపిసోడ్ వంటి హార్డ్ హిట్టింగ్ ఇష్యూల చుట్టూ ర‌స‌వ‌త్త‌రంగా సినిమాను మ‌లిచిన‌ట్లు తెలుస్తోంది. కాగా కంగ‌నా బీజేపీ ఎంపీ కావ‌డం, ఇందులో న‌టించిన వారు కాస్త ఆ పార్టీకి అనుకూల‌మైన‌ వారు ఎక్కువ‌గా ఉండ‌డం ఇత్యాధి అంశాల‌తో సినిమా ఒక పార్టీని త‌క్కువ‌గా, త‌ప్పుగా చూయించార‌నే వాద‌న ప‌క్క‌గా రావొచ్చ‌ని తెలుస్తోంది. చూడాలి మ‌రి ఈ సినిమా ఎలాంటి ప‌రిస్థితులు తీసుకువ‌స్తుందో. ముఖ్యంగా ఇందిరా ఈజ్‌ ఇండియా, ఇండియా ఈజ్‌ ఇందిర అనే డైలాగ్స్ సినిమా నేప‌థ్యాన్ని బ‌లంగా తెలియ‌జేస్తుంది.

Also Read : Upasana Konidela: స్వాతంత్య్ర  దినోత్సవం వేళ వైరల్ గా మారిన ఉపాసన ట్వీట్ !

emergencyKangana Ranaut
Comments (0)
Add Comment