Kangana Emergency : నెట్ ఫ్లిక్స్ లో కంగనా ఎమ‌ర్జెన్సీ స్ట్రీమింగ్

న‌టించి నిర్మించిన బాలీవుడ్ న‌టీమ‌ణి

Emergency : ప్ర‌ముఖ బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్ న‌టించడ‌మే కాకుండా నిర్మించిన చిత్రం ఎమ‌ర్జెన్సీ(Emergency). అనుకున్న తేదీ కంటే ముందుగానే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో శుక్ర‌వారం నాడే స్ట్రీమింగ్ కావ‌డం విస్తు పోయేలా చేసింది. మూవీ మేక‌ర్స్ మార్చి 17న వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ ఎందుక‌నే దానికంటే ముందే వ‌చ్చేసింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ప్రీమియ‌ర్ గా ప్ర‌ద‌ర్శించింది. దీంతో కంగ‌నా ర‌నౌత్ అభిమానులు ఒకింత ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు.

Emergency Movie OTT Updates

ఇక కంగ‌నా ర‌నౌత్ ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడేస్తుంది. ఆమె హిందూ వాయిస్ గా కొన‌సాగుతోంది. త‌నంతట తానుగా తాను ప్ర‌త్యేక హిందూవాదినంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇదే స‌మ‌యంలో త‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీకి మౌత్ పీస్ గా ఉంటూ వ‌చ్చింది. దీంతో త‌న‌కు జెడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త కూడా క‌ల్పించింది. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. అయినా డోంట్ కేర్ అంటోంది ఈ అమ్మ‌డు. త‌ను ఇప్పుడు బీజేపీ త‌ర‌పున ఎంపీగా విజ‌యం సాధించింది. పార్ల‌మెంట్ లోకి అడుగు పెట్టింది.

ఇదిలా ఉండ‌గా దేశంలో అప్ప‌టి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌ధాన‌మంత్రి దివంగ‌త ఇందిరా గాంధీ హ‌యాంలో ఎమ‌ర్జెన్సీని విధించింది. ఇది చీక‌టి రోజుగా అభివ‌ర్ణిస్తారు తెలిసిన రాజ‌కీయ నాయ‌కులంతా. దేశంలో స్వేచ్ఛ లేకుండా చేయ‌డ‌మే కాకుండా ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన నేత‌ల‌ను జైలుపాలు చేసిన ఘ‌న‌మైన చ‌రిత్ర ఇందిరా గాంధీకి ఉంది. ఆమె జీవితంలో ఇది చీక‌టి అధ్యాయంగా మిగిలి పోయింది. ఆ త‌ర్వాత త‌ను ప‌ద‌విని కోల్పోయింది. జైలు పాల‌య్యింది కూడా.

ఇది అంద‌రి క‌ళ్ల ముందు జ‌రిగిన చ‌రిత్ర‌. దీనికి సాక్షి భూతంగా నిలిచేలా ఎమ‌ర్జెన్సీని తీసింది. ఇందులో ఇందిరా గాంధీ పాత్ర‌ను కంగ‌నా ర‌నౌత్ పోషించింది. విడుద‌లైన ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. మొత్తంగా రూ. 21 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చేసింది.

Also Read : Victory Venkatesh Movie :ఓటీటీలో వెంకీ మామా మ‌జాకా

CinemaemergencyKangana RanautOTTUpdatesViral
Comments (0)
Add Comment