Emergency: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్… స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన తాజా సినిమా ‘ఎమర్జెన్సీ’ . భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించారు. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. కంగనా స్వంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఎమర్జెన్సీ(Emergency)” సినిమా నిర్మాణం, దర్శకత్వం, ఇందిరా గాంధీ పాత్రల బాధ్యతలను తానే స్వయంగా తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది కంగనా రనౌత్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకునన ఈ సినిమాను సెప్టెంబర్ 6 న థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
Emergency Movie Sensor Updates
అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండి పలు వివాదాలకు కారణమౌతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమర్జెన్సీ(Emergency) నాటి పరిస్థితుల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదలవగా… తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. కంగన ఈ విషయంపై హత్య బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కంగనా ఈ సినిమా సెన్సార్ కోసం కంగన బాంబే హైకోర్టును సంప్రదించగా ఆమెకు ఊరట లభించలేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) తాము ఆదేశించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.సెన్సార్ కార్యక్రమాలు ఆలస్యంకావడంతో ఈ నెల 6న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది.
అయితే ఈ సినిమా సెన్సార్ ఎట్టకేలకు పూర్తయింది. ఆ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు… పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా సీన్స్‌ను తొలగించడమో వాటి స్థానంలో కొత్తవి జోడించడమో చేయాలని చిత్ర బృందానికి సూచించింది. బంగ్లాదేశ్ శరణార్థులపై పాకిస్థాన్ సైనికులు దాడి చేయడం, ఓ చిన్నారి, ముగ్గురు మహిళలను శిరచ్ఛేదం చేయడం వంటి సన్నివేశాలను మార్చాలని చెప్పింది. భారత మహిళలను కించపరిచేలా నిక్సన్ పాత్ర చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, బంగ్లాదేశ్ శరణార్థులు, కోర్టు తీర్పుల సమాచారం ఎక్కడిది? ‘ఆపరేషన్ బ్లూస్టార్’ ఫుటేజీ అనుమతికి సంబంధించి కొన్ని వివరాలు కోరింది. దీనితో ఈ సినిమాకోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న వర్గం సెన్సార్ బోర్డు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సినిమా రిలీజ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Sonakshi Sinha: మతాంతర వివాహాంపై ఎదుర్కొన్న ట్రోల్స్ కు ఒక్క వీడియోతో సమాధానం చెప్పిన సోనాక్షి !