Kamal237 : స్టంట్ మాస్టర్స్ ద్వయం అన్బరివులు అగ్ర నటుడు కమల్ హాసన్ 237వ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ నిర్మాణ పనులు చికాగోలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న కమల్ హాసన్(Kamal Haasan)ను దర్శక ద్వయం కలుసుకుని, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించింది. ‘ఇండియన్-2’ చిత్రం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్‌లైఫ్’ అనే చిత్రంలో కమల్ హాసన్ నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ(ఏఐ) పనులు రెండు నెలలుగా అమెరికాలో జరుగుతున్నాయి. వాటిని పూర్తి చేసుకుని ఆయన త్వరలో చెన్నై నగరానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత తన 237వ చిత్ర పనులపై ఆయన దృష్టిసారించనున్నారు.
Kamal237th Movie Updates
‘కమల్237’ సినిమా వివరాల్లోకి వెళితే.. ఇది పూర్తి స్థాయి యాక్షన్ భరితంగా తెరకెక్కనుంది. అన్బరివులు కూడా కొత్త ప్రాజెక్టులు ఏవీ అంగీకరించకుండా కేవలం కమల్ సినిమాపైనే దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని చికాగోలో ఉన్న కమల్ హాసన్‌ను కలిసి ప్రీ ప్రొడక్షన్ నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోతో దిగిన ఫొటోను వారు షేర్ చేయగా.. ఆ ఫొటో వైరల్ అవుతోంది. ‘విక్రమ్’ సినిమా తర్వాత కమల్ హాసన్ వరుస సినిమాలతో స్పీడు మీదున్న విషయం తెలిసిందే.ఒకదాని తర్వాత ఒకటి ఆయన నుండి సినిమా ప్రకటనలు వస్తున్నాయి. అలాగే నిర్మాతగానూ ఆయన బిజీగా ఉన్నారు. ఆయన నిర్మించి, రీసెంట్‌గా వచ్చిన ‘అమరన్’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
Also Read : Tollywood : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న టాలీవుడ్ ప్రముఖులు