Kamal Hasan: ఫైట్ మాస్టర్ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ కొత్త సినిమా !

ఫైట్ మాస్టర్ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ కొత్త సినిమా !

Kamal Hasan: తెలుగులో ఫైట్ మాస్టర్స్ అంటే టక్కున గుర్తుకొచ్చేది రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. వీరిలాగే తమిళంలో యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అంటే అన్బరివ్‌. అన్బుమణి, అరివుమణి అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి అన్భరివ్ గా గుర్తింపు పొందారు. తమిళంలో దాదాపు హిట్ సినిమాలన్నింటీకీ యాక్షన్ కొరియోగ్రాఫర్లు వీరే. తమిళంతో పాటు పలు దక్షిణాది, హిందీ సినిమాలకు కూడా వీరు పనిచేస్తున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన యాక్షన్ సినిమాలు కేజీఎఫ్, లియో, విక్రమ్, దసరా వంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసింది వీరే. ప్రస్తుతం ఈ ద్వయం ఇండియన్ -2, గేమ్ ఛేంజర్, కల్కీ, థగ్ లైఫ్ సినిమాలకు కూడా యాక్షన్ కొరియోగ్రఫర్లుగా పనిచేస్తున్నారు. అయితే వీరు మొదటిసారిగా మెగా ఫోన్ పట్టబోతున్నారు. అలా అని చిన్న చిన్న హీరోతో కాకుండా ఏకంగా కమల్ హాసన్(Kamal Hasan) ను డైరెక్ట్ వహించడానికి సిద్ధం అవుతున్నారు. అన్భరివ్ దర్శకత్వంలో కమల్ తన 237వ సినిమాను చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Kamal Hasan Movie Updates

యా క్షన్‌ కొరియోగ్రాఫర్లు అన్బరివ్‌ (అన్బుమణి, అరివుమణి) దర్శకత్వంలో…. తన 237వ సినిమాలో నటిస్తున్నట్లు కమల్‌ హాసన్‌ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దక్షిణాదితోపాటు… బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకి యాక్షన్‌ కొరియోగ్రాఫర్లుగా పనిచేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్న… ‘‘ఇద్దరు ప్రతిభావంతులు వారి కొత్త అవతారంగా నా 237వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్స్‌ అన్బరివ్‌లకు మా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం పలుకుతున్నా’’ అంటూ తన ఎక్స్‌ అకౌంట్ ద్వారా ప్రకటించారు కమల్‌హాసన్‌. ఈ చిత్రాన్ని కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ తమ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనున్నారు.

Also Read : Ram Charan : అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కు చరణ్ ఫ్యామిలీ కి ఆహ్వానం

Anbarivkamal hasan
Comments (0)
Add Comment