Kamal Hasan: కమల్-మణిరత్నం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

క్రేజీ కాంబో కమల్-మణిరత్నం సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది.

కమల్ హాసన్-మణిరత్నం సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది

 

Kamal Hasan : క్రేజీ కాంబో మణిరత్నం-కమల్ హాసన్ సినిమా కోసం సుమారు 36 ఏళ్ళుగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది. 1987లో ‘నాయకన్‌’ (తెలుగులో నాయకుడు) సినిమాతో సంచలనం సృష్టించిన ఈ కాంబో ఇప్పుడు కమల్‌-234వ (#KH234) సినిమాను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో పాటు కమల్ హాసన్ పుట్టిన రోజు (నవంబర్ 7) సందర్భంగా చిత్ర యూనిట్ పలు అప్ డేట్లను ఇస్తూ వస్తుంది. దీనిలో భాగంగా ‘బిగిన్‌ ది బిగిన్‌’ పేరుతో చిత్ర యూనిట్ సోమవారం ఉదయం ఓ ప్రోమోని విడుదల చేశారు. అంతేకాదు సాయంత్రం సినిమా టైటిల్ కూడా ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. మద్రాస్‌ టాకీస్‌, రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఆ చిత్రానికి ఎ. ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. దీనితో 36 ఏళ్ళ ఫ్యాన్స్‌ నిరీక్షణకు కమల్‌ తెరదించారు.

తాను మణిరత్నం దర్శకత్వంలో నటించబోతున్నట్టు ‘KH 234’ వర్కింట్ టైటిల్‌ ను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో కమల్‌, మణిరత్నం అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘విక్రమ్‌’ సినిమాతో ఈ ఏడాది మంచి కమ్‌బ్యాక్‌ అందుకున్న కమల్‌(Kamal Hasan) ప్రస్తుతం శంకర్‌ దర్శత్వంలో ‘ఇండియన్‌ 2’లో నటిస్తున్నారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రెండు పార్ట్ లతో మణిరత్నం మళ్ళీ ఫాంలోనికి వచ్చారు. భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా తెలుగులో ఓకే అనిపించుకున్నా తమిళంలో మంచి ఆదరణ పొందింది.

Kamal Hasan – ‘నాయకన్‌’ (తెలుగులో నాయకుడు) కు 36 ఏళ్ళు

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాయకన్‌’ (తెలుగులో నాయకుడు) అప్పట్లో ఓ సంచలనం. ఓ గ్యాంగ్‌స్టర్‌ జీవితాధారంగా రూపొందిన ఆ సినిమా 1987లో విడుదలై, ఘన విజయం అందుకుంది. మణిరత్నం, కమల్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. సుజాత ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాలో కమల్ సరసన శరణ్య నటించగా… ఇళయరాజా సంగీతం, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.

Also Read : Leo Movie : ఐదురోజుల ముందే విడుదల కానున్న లియో

ar rehamankamalhasan.kh234maniratnam
Comments (0)
Add Comment