Kamal Hasan: శింబు సినిమాలో కమల్‌ హాసన్‌ ?

శింబు సినిమాలో కమల్‌ హాసన్‌ ?

Kamal Hasan: ప్రముఖ దర్శకుడు దేశింగు పెరియసామి దర్వకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను విశ్వ నటుడు కమల్ హాసన్ తన స్వంత బ్యానర్ అయిన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శింబు… నాయకుడు, ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినం చేస్తుండగా ఆయన సరసన కీర్తి సురేష్‌, మృణాల్‌ ఠాగూర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కోసం శింబు తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకుని ప్రత్యేకంగా కుంగ్ ఫూ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

‘STR 48’ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన రావడంతో పాటు… ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Kamal Hasan Movie Updates

‘STR 48’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న శింబు సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్(Kamal Hasan) కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సినిమాను తన స్వంత బ్యానర్ అయిన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న కమల్ హాసన్… ఓ అతిధి పాత్రలో కూడా నటిస్తున్నాడని తెలిసి అటు శింబు, ఇటు కమల్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. దీనితో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగి పోతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ మార్చి నెల రెండో వారంలో ప్రారంభం కాబోతున్నట్లు తాజా సమాచారం.

Also Read : Producer Dil Raju: దిల్‌ రాజు ఇంట మొదలైన పెళ్లి సందడి !

kamal hasanSimbu
Comments (0)
Add Comment