Kamal Haasan: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సు నేర్చుకోవడానికి యూఎస్‌ వెళ్లిన కమల్‌ హాసన్‌ ?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సు నేర్చుకోవడానికి యూఎస్‌ వెళ్లిన కమల్‌ హాసన్‌ ?

Kamal Haasan: పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయే భారతీయ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. సాగర సంగమం, శుభసంకల్పం, విచిత్ర సోదరులు, భామనే భామనే, భారతీయుడు, తెనాలి, దశావతారం, విశ్వరూపం, విక్రమ్ ఇలా ఏ పాత్రలో అయినా నటించగల దేశం గర్వించ దగ్గ నటుడు లోక నాయకుడు కమల్(Kamal Haasan). అయితే స్టార్ డమ్ విషయంలో ఎంత ఎత్తుకు ఎదిగినా… సినిమా విషయంలో ఎప్పుడూ నిత్య విద్యార్ధిగా ఆయన ఉంటారు. డ్యాన్స్ తో పాటు ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ అభిరుచితోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సు నేర్చుకునేందుకు ఆయన ఇటీవల యూఎస్‌ వెళ్లినట్టు తెలిసింది. అక్కడ ఓ టాప్‌ ఇన్‌ స్టిట్యూట్‌ లో ఆయన శిక్షణ తీసుకోనున్నట్టు సమాచారం. ఓ వైపు సినిమాలతో, మరోవైపు రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ అధునాతన టెక్నాలజీపై పట్టు సాధించేందుకు కమల్‌ వెళ్లారని సన్నిహిత వర్గాలు ఓ కోలీవుడ్‌ మీడియాకు తెలిపాయి. 90 రోజుల కోర్సుకాగా నటుడు 45 రోజులు హాజరవుతారని పేర్కొన్నాయి.

Kamal Haasan Learning..

ఏఐని ఇప్పటికే సినీ రంగంలో విరివిగా వినియోగిస్తున్నారు. కృతిమ మేథ సాయంతో దివంగత నటుల రూపాన్ని, దివంగత గాయకుల గాత్రాన్ని ఆవిష్కరించి ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచాయి పలు చిత్ర బృందాలు. కమల్‌ హాసన్‌ తదుపరి ప్రాజెక్టుల్లోనూ ఏఐ కీలక పాత్ర పోషించనుంది. గతంలోనూ.. తన సినిమాల ద్వారా ఎన్నో కొత్త టెక్నాలజీలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు కమల్‌. ‘కల్కి 2898 ఏడీ’ లో సుప్రీం యాస్కిన్‌ గా, ‘భారతీయుడు 2’లో సేనాపతిగా అలరించిన కమల్‌ ప్రస్తుతం ‘థగ్‌ లైఫ్‌’ లో నటిస్తున్నారు. మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Also Read : Racharikam: అప్సరా రాణి ‘రాచరికం’ నుండి టిక్కు టిక్కు సాంగ్ రిలీజ్ !

indian 2Kamal Haasanthug life
Comments (0)
Add Comment