Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ ‘కేహెచ్’ హౌస్ ఆఫ్ ఖద్దర్ అనే బ్రాండ్‌తో ఖాదీ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే, న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో ఈ దుస్తులకు చెందిన సరికొత్త కలెక్షన్ ‘సుటూర’ను… ప్రదర్శించారు. ఈ సరికొత్త కలెక్షన్‌ను కమల్ హాసన్(Kamal Haasan) తన ‘కల్కి 2898 ఏ.డీ’ కో స్టార్ ప్రభాస్ కు కానుకగా పంపారు. ఈ కానుకను అందుకున్న ప్రభాస్.. తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
Kamal Haasan…
‘‘ప్రేమతో ఈ గిఫ్ట్ పంపించినందుకు కృతజ్ఞతలు కమల్ సర్. మీ కొత్త కలెక్షన్ కు ఆల్ ద బెస్ట్’’ అని పేర్కొన్నారు. కాగా, ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తాజా సినిమా ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించి… ఇప్పటివరకు రూ. 1100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమాలో.. భైరవ పాత్రలో ప్రభాస్.. ‘సుప్రీమ్ యాస్కిన్’ పాత్రలో కమల్ హాసన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏ.డీ’ పార్ట్ 2లో ప్రభాస్, కమల్ హాసన్ పూర్తి స్థాయి నిడివితో నటించనున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : Sobhita Dhulipala: డైరెక్ట్ గా ఓటీటీకి అక్కినేని కాబోయే కోడలు సినిమా ! స్ట్రీమింగ్ ఎక్కడంటే ?