Kamal Haasan: అగ్రకథానాయకుడు కమల్ హాసన్(Kamal Haasan)… హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. తమిళంలో ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఆయనే వ్యాఖ్యాతగా చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ షో నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పారు. ‘ఏడేళ్ల క్రితం మొదలైన మా ప్రయాణంలో చిన్న విరామం. సినిమా కమిట్‌మెంట్స్ వల్ల రాబోయే బిగ్‌బాస్ సీజన్ కి హోస్టింగ్ చేయట్లేదు. ఈ విషయాన్ని చాలా బాధతో చెబుతున్నా… ఈ షో ద్వారా ఇంటింటికీ చేరువైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. మీరు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అలా బిగ్‌బాస్ తమిళ షోని భారతీయ టీవీ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్‌గా నిలిపారు. హోస్ట్‌గా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. ఈ క్రమంలోనే భాగమైన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు’ అని కమల్ హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Kamal Haasan…
వ్యాఖ్యాతగా నన్ను నేను మరో కొత్త కోణంలో చూడటమే కాదు, ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా అద్భుతమైన విజయ్ టీవీ టీమ్‌కు కృతజ్ఞతలు. రాబోయే సీజన్ మరింత విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల ‘కల్కి’లో విలన్‌గా ఆకట్టుకున్న కమల్(Kamal Haasan).. ‘భారతీయుడు 2’తో హీరోగా పరాజయం అందుకున్నాడు. ఈయన చేతిలో ప్రస్తుతం ‘థగ్ లైఫ్’, ‘భారతీయుడు 3’ సినిమాలు చేస్తున్నారు. దీని తర్వాత ‘విక్రమ్2’ పట్టాలెక్కే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. ‘కల్కి 2’ ఉంది కానీ అదెప్పుడో సెట్స్‌పైకి వెళ్తుందో తెలీదు. అయితే బిగ్‌బాస్ నుంచి తప్పుకొన్న నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసే కొత్త హోస్ట్ ఎవరా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
‘బిగ్‌బాస్’ తమిళ్‌కు కమల్‌హాసన్ విరామం ప్రకటించడంతో తర్వాత ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న ఆసక్తి మొదలైంది. నటుడు శింబు పేరు సోషల్‌మీడియాలో బాగా వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగు బిగ్‌బాస్‌కు సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టీజర్ కూడా విడుదల చేశారు. త్వరలోనే 8వ సీజన్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తమిళ్‌లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.
Also Read : Ramajogayya Sastry: తిరుమల సన్నిధిలో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ రచయిత !