Kamal Haasan: వేసవిలో వస్తున్న ‘ఇండియన్‌ 2’

వేసవిలో వస్తున్న ‘ఇండియన్‌ 2’

Kamal Haasan: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్(Kamal Haasan) నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఇండియన్ 2’. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రధారులు. ఇటీవల చెన్నైలో భారీ షెడ్యూల్‌ పూర్తి చేసిన చిత్ర యూనిట్ ఇదే షెడ్యూల్‌తో టాకీ పార్టు కూడా పూర్తిచేసినట్లు సమాచారం. బ్యాలెన్స్‌ ఉన్న రెండు పాటల షూటింగ్‌ ను కూడా పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారట చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Kamal Haasan Movie Updates

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ డబుల్ యాక్షన్ లో 1996లో నిర్మించిన ఇండియన్ సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఓ సన్సేషన్. స్వాతంత్ర సమరయోధుడిగా, అవినీతిని అన్యాయాన్ని వ్యతిరేకించే భారతీయుడిగా కమల్ హాసన్ నటన అద్భుతం. ఇక ఈ సినిమాతో శంకర్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనీషా కొయిరాల అందాలు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకు మరో హైలైట్.

సుమారు 27 ఏళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అదేవిదంగా రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనితో చిత్ర దర్శకుడు శంకర్ చిత్ర ప్రచార కార్యక్రమాలను షురూ చేసే పనిలో పడ్డారు.

Also Read : Kajal Pasupathi: రెండో పెళ్లి చేసుకున్న కాజల్ పసుపతి ?

indian 2kamal hasansankar
Comments (0)
Add Comment