Kamal Haasan : లోక‌నాయ‌కుడి మూవీకి భారీ బ‌డ్జెట్

మ‌ణిర‌త్నం మూవీపై అంచ‌నాలు

Kamal Haasan : భార‌తీయ సినీ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుల్లో ఒక‌డు లోక‌నాయ‌కుడిగా గుర్తింపు పొందిన క‌మ‌ల్ హాస‌న్. ఆయ‌న త‌మిళంలోనే కాదు ఇటు తెలుగులోనూ కూడా సుప‌రిచితుడు. హిందీలో కూడా ఫేమ‌స్. త‌ను పార్టీని కూడా ఏర్పాటు చేశారు.

Kamal Haasan Thung  Life Movie

గ‌త ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగాడు. ఆశించిన మేర ఫ‌లితాలు రాలేదు. త‌న స‌హ న‌టుడు, ప్రాణ స్నేహితుడు ర‌జ‌నీకాంత్ కూడా త‌ప్పుకున్నాడు. త‌ను ఇటీవ‌ల న‌టించి విడుద‌లైన జైల‌ర్ రికార్డుల మోత మోగించింది.

తాజాగా విక్ర‌మ్ త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్(Kamal Haasan) సెన్సేష‌న్ గా మారారు. దీనికి కార‌ణం 27 ఏళ్ల త‌ర్వాత ఇండియన్ -2 మూవీ రానుంది. ఇందు కోసం శంక‌ర్ క‌ష్ట ప‌డుతున్నాడు. ఈ సినిమా నిర్మాణం ఖ‌ర్చు దాదాపు రూ.250 కోట్ల‌కు పైగా ఉందంటూ ప్ర‌చారం జ‌రిగింది.

హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ఇంకో చిత్రంలో న‌టిస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్. ఇది కూడా రూ. 150 కోట్ల‌కు పైగా ఖ‌ర్చ‌వుతోంద‌ని తెలిసింది. ఇక దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో థ‌గ్ లైఫ్ పేరుతో రానున్నాడు. ఈ చిత్రం బ‌డ్జెట్ ఊహించ‌ని రీతిలో రూ. 300 కోట్ల‌కు పైగా అవుతోంద‌ట‌. ఇక ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్ గ్యాంగ్ స్ట‌ర్ ను పోలిన‌వి ఉన్నాయి. భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Also Read : Touching Touching Song : ట‌చ్ చేస్తున్న ట‌చింగ్ ట‌చింగ్

Comments (0)
Add Comment