Kalyanram: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘దేవర’. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, కల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. దేవర పార్టు 1ను ఏప్రిల్ 5, 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ ‘దేవర’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్ ఓ ఇంటరెస్టింగ్ అప్ డేట్ ను ఇచ్చారు.
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్(Kalyanram) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో ‘డెవిల్’ విషయాలను చెప్పిన అనంతరం కళ్యాణ్ రామ్ తన తమ్ముడు యంగ్ టైగర్ ‘దేవర’ సినిమా గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Kalyanram – ‘దేవర’ తో ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం- కళ్యాణ్ రామ్
ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… ‘‘తమ్ముడు ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ గురించి చెప్పాలంటే… ఆర్ఆర్ఆర్ వంటి సినిమా చేసిన తర్వాత ఓ యాక్టర్‌కి, ఓ డైరెక్టర్‌కి, ప్రొడక్షన్ హౌస్‌కి గాని ఎంతో బాధ్యత ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఏ చిన్న పొరపాటు జరిగినా ఎవరూ ఊరుకోరు. అందుకే బాధ్యతగా తీసుకుని ఎంతో కష్టపడుతున్నాం. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రాబోతుంది. దానికి కావాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వి.ఎఫ్.ఎక్స్‌కి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మేం ‘దేవర’ మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే గ్లింప్స్ డేట్‌ను టీమ్ అనౌన్స్ చేస్తుంది’’ అని అన్నారు. కళ్యాణ్ రామ్ ఇచ్చిన అప్ డేట్… నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించడంతో పాటు ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తుంది.
Also Read : Director Nelson: నిర్మాతగా మారిన ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ !