Kalyan Ram Devil: రెండువారాలకే ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ ‘డెవిల్‌’ !

రెండువారాలకే ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ ‘డెవిల్‌’ !

Kalyan Ram Devil: నందమూరి క‌ల్యాణ్‌ రామ్ న‌టించిన తాజా సినిమా ‘డెవిల్‌(Devil)’. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా రూపొందించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌… డిసెంబర్‌ 29న విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో… దీనికి సీక్వెల్ ను కూడా త్వరలో తీయబోతున్నట్లు కళ్యాణ్ రామ్ ప్రకటించారు. అయితే ‘డెవిల్‌(Devil)’ విడుదలై రెండు వారాలు కాకముందే… ఆ సినిమా ఓటీటీ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌ చేసింది చిత్ర యూనిట్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జనవరి 14 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే విడుదలై రెండు వారాలు అయిందో లేదో సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాని ఓటిటి లో స్ట్రీమింగ్ చేయడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ‘డెవిల్‌’ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Kalyan Ram Devil – డెవిల్‌ కథ ఏమిటంటే !

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘డెవిల్‌’. కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ నటించగా… హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిచారు. స్వాతంత్య్రానికి పూర్వం మద్రాస్‌ ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో పీరియాడికల్ స్పై థ్రిల్లర్‌ గా రూపొందించిన ఈ సినిమాలో… స్వాతంత్ర్యం కోసం పాటుపడిన సుభాష్ చంద్ర‌బోస్‌ని ప‌ట్టుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంటుంది ఆనాటి బ్రిటిష్ ప్ర‌భుత్వం. ఆ స‌మ‌యంలోనే బ్రిటిష్ ప్ర‌భుత్వంలో సీక్రెట్ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంటాడు డెవిల్ (క‌ల్యాణ్‌రామ్‌).

ర‌స‌పురంలోని జ‌మిందార్ ఇంట్లో జ‌రిగిన ఓ హ‌త్య కేసుని ఛేదించ‌డానికి ప్ర‌భుత్వం అతడిని పంపుతుంది. కేసు దర్యాప్తులో సుభాష్ చంద్ర‌బోస్ నేతృత్వంలో న‌డుస్తున్న ఐఎన్ఏ (ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీ) ఏజెంట్ల‌ను గుర్తిస్తాడు డెవిల్‌. మరోవైపు, బోస్… తన కుడి భుజ‌మైన త్రివ‌ర్ణతో టచ్‌ లో ఉన్న విష‌యాన్ని డెవిల్‌ ప‌సిగ‌డ‌తాడు. సుభాష్ చంద్ర‌బోస్‌కి కోడ్ రూపంలో ఓ సమాచారాన్ని చేర‌వేసేందుకు త్రివర్ణ, మ‌రికొద్ది మంది ఐఎన్ఏ ఏజెంట్లు ప్రయత్నిస్తుంటారు. మ‌రి ఆ కోడ్‌తో జ‌మిందార్ ఇంట్లో హ‌త్య‌కు సంబంధం ఏమిటి ? ఎన్నో చిక్కుముడులున్న ఈ కేసుని డెవిల్ ఎలా ఛేదించాడు ? అస‌లు ఈ క‌థ‌లో త్రివ‌ర్ణ ఎవ‌రు? నైష‌ధ (సంయుక్త‌), మ‌ణిమేక‌ల (మాళ‌విక నాయ‌ర్‌)తో ఆమెకు సంబంధం ఏమిటి ? బోస్‌ని బ్రిటిష్ ప్ర‌భుత్వం ప‌ట్టుకుందా ? వంటి అంశాలతో ‘డెవిల్‌’ ను ఆశక్తికరంగా తెరకెక్కించారు దర్శక నిర్మాత అభిషేక్ నామా.

Also Read : Ram Charan and Upasana: రామమందిర ట్రస్టు నుండి రామ్ చరణ్‌ దంపతులకు ఆహ్వానం !

devilKalyan Ram
Comments (0)
Add Comment