Hero Kalyan Ram Movie :18న రానున్న అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి

క‌ళ్యాణ్ రామ్ రాముల‌మ్మ మూవీ డేట్ ఫిక్స్

Kalyan Ram : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రాములమ్మ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టించిన అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి చిత్రానికి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది. ఏప్రిల్ 18న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. దీంతో నంద‌మూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ కు జోష్ నింపుతోంది ఈ వార్త‌. టాలెంట్ ఉంటే చాలు త‌లుపుత‌ట్టి వారిని ప్రోత్స‌హించే గుణం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్(Kalyan Ram) కు ఉంది. త‌ను ప‌టాస్ తీశాడు. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి లైఫ్ ఇచ్చాడు. ఇదే విష‌యం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ వ‌స్తారు ద‌ర్శకుడు.

Kalyan Ram – Arjun s/o Vyjayanthi Movie Updates

త‌ను తీసిన బింబిసార సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. వ‌శిష్ట‌కు లైఫ్ ఇచ్చాడు క‌ళ్యాణ్ రామ్. త‌ను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభ‌ర తీస్తున్నాడు. ఇది రిలీజ్ కాకుండానే రికార్డ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా త‌ను న‌టించిన కొత్త చిత్రం అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి(Arjun s/o Vyjayanthi). ఇందులో సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమా టీజ‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేలా చేసింది. ఈ స‌మ్మ‌ర్ సెష‌న్ లో మ‌రికొన్ని సినిమాలు ముందుకు రానున్నాయి. వాటిలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా న‌టించిన ఓదెల 2 సీక్వెల్ చిత్రం రిలీజ్ అవుతుంది.

విచిత్రం ఏమిటంటే క‌ళ్యాణ్ రామ్ న‌టించిన మూవీ ఒక రోజు కంటే ముందే ఇది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రో వైపు స‌హ‌జ సిద్ద‌మైన ద‌ర్శ‌కత్వానికి పేరొందిన ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సారంగ‌పాణి జాత‌కం కూడా విడుద‌ల కానుండ‌డం విశేషం. ఈ రెండు మూవీస్ తో పాటు అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ క‌న్ ఫ‌ర్మ్ చేయ‌డంతో క‌ళ్యాణ్ రామ్ మూవీ ప్ర‌మోష‌న్స్ పై ఫోక‌స్ పెట్టేందుకు రెడీ అయ్యాడు. మ‌రో వైపు త‌న సోద‌రుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా రానున్నాడు.

Also Read : Beauty Rashmika :సినిమాల్లోకి వ‌స్తాన‌ని అనుకోలేదు

Arjun s/o VyjayanthiCinemaNandamuri Kalyan RamTrendingUpdates
Comments (0)
Add Comment