Kalki 2898 AD : సలార్ సక్సెస్ తర్వాత ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘కల్కి 2898AD’ ప్రభాస్ తదుపరి అద్భుతమైన యాక్షన్ చిత్రం. సినిమా విడుదలకు మరో మూడు నెలల సమయం పడుతుంది. సినిమా పనులు ఆలస్యమైతే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ప్రభాస్ సినిమాలంటే హడావిడి వారం నుంచి 10 రోజుల ముందు జరుగుతుంది. అయితే కల్కి విషయంలో చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ కొత్త వ్యూహాన్ని అనుసరించాడు.
Kalki 2898 AD Updates Viral
ప్రభాస్ సినిమాల ప్రమోషన్స్ ఎప్పుడూ హడావిడిగా జరుగుతాయని, అది ఓపెనింగ్‌పై ప్రభావం చూపుతుందని ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో చెబుతుంటారు. అయితే కల్కి సినిమాకి నాగ్ అశ్విన్ చేసిన పబ్లిసిటీ స్టంట్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. నాగ్ అశ్విన్ తన సినిమా ప్రమోషన్ రొటీన్ ని ప్రభాస్ కంటే డిఫరెంట్ గా స్టార్ట్ చేసి కల్కి(Kalki 2898 AD) సినిమాకి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అనందానికి అవదులులేవు.
విదేశాల్లో నిర్వహించిన కామిక్ కాన్ ఫెస్టివల్‌తో కల్కి ప్రమోషన్ వినూత్నంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫన్ ఎగ్జిబిషన్‌లో సినిమాకు వచ్చిన ప్రశంసలు మరో లెవల్‌లో ఉన్నాయి. అంతేకాదు కల్కి ప్రమోషన్స్‌లో భాగంగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సినీ ప్రేమికులను అలరించారు. నిన్న చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన లైవ్ కాన్సర్ట్‌కు పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సంతోష్ కల్కి(Kalki 2898 AD) సినిమా సంగీతం నుంచి చిన్న పార్ట్ లైవ్ చేసి అందరినీ ఆనందపరిచారు. సినిమాలోని చిన్న మ్యూజిక్ మాత్రమే ఇంత అద్భుతంగా ఉంటె ఇంకా సినిమా బీజిఎం ఎలా ఉంటుందో అని అందరూ షాక్ అవుతున్నారు.
వైజయంతీ మూవీస్ అధికారికంగా రిలీజ్ చేసిన ఈ చిన్న పాటను సంగీత దర్శకుడు విడుదల చేశారు. ఈ చిన్న కాన్సెప్ట్ సినిమాపై అంచనాలను పెంచిందనడంలో సందేహం లేదు. కల్కి సినిమా ప్రమోషన్‌కు నాగ్ అశ్విన్ ఈ ప్లాన్.. పద్దతి పాటిస్తూ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.. వీటన్నింటితో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read : HanuMan Updates : ఇప్పటికి భారీ వసూళ్లతో రికార్డులు సృష్టిస్తున్న ‘హనుమాన్’