Kalki 2898 AD: ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తాజా సినిమా ‘కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD)’. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించి… ఇప్పటివరకు రూ. 1100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది.
Kalki 2898 AD Ticket Prices
భారీ బడ్జెట్ సినిమా కావడంతో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేస్తూ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక జీవోలు ఇచ్చాయి. రెండు వారాల పాటు అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించినప్పటికీ… తరువాత సాధారణ ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నారు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో… ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ వారం కల్కి సినిమాను తక్కువ ధరకే థియేటర్లలో అందుబాటులో ఉంచాలని డిసైడ్ అయింది.
కల్కిని కేవలం రూ.100కే ఆస్వాదించండి. ఆగస్టు 2 నుంచి 9 వరకు ఇండియా అంతటా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పటివరకు కల్కి చూడనివారికి, మరోసారి సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది శుభవార్తే అవుతుంది.
Also Read : Vijay Antony: త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటోన్న విజయ్ ఆంటోని !