Kalki 2898 AD : శ‌ర వేగంగా కల్కి 2898 ఏడీ షూటింగ్

నాగ్ అశ్విన్ కు రాజ‌మౌళి స‌పోర్ట్

Kalki 2898 AD : మ‌హాన‌టితో దేశ వ్యాప్తంగా పేరు పొందిన నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న క‌ల్కి 2898 ఏడీ (క్రీస్తు శ‌కం) మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది 2024లో విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

సైన్స్ ఫిక్ష‌న్ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్ తో పాటు ల‌వ్లీ బ్యూటీ దీపికా ప‌దుకొనే న‌టిస్తుండ‌డం విశేషం. క‌ల్కి 2898 ఏడీ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అన్నీ నాగ్ అశ్విన్ చూసుకుంటున్నారు.

Kalki 2898 AD will be Released on 2024

ఈ చిత్రాన్ని రూ. 600 కోట్ల‌కు పైగా పెట్టి తీస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక తూటాల్లాంటి మాట‌లు రాసే బుర్రా సాయి మాధ‌వ్ క‌ల్కి చిత్రానికి మాట‌లు రాస్తుండ‌డం మ‌రింత హైప్ పెంచేలా చేసింది. ఇక నాగ్ అశ్విన్ టేకింగ్, మేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

ఓం రౌత్ ఆది పురుష్ తర్వాత ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ విడుద‌ల కానుంది. ఆ త‌ర్వాత క‌ల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) రానుంది. దీంతో ప్ర‌భాస్ ఈ రెండు సినిమాల‌పై పెద్ద ఎత్తున న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్ విడుద‌ల చేశారు. మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ కొన‌సాగుతోంది.

క‌ల్కి చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ తో పాటు దీపికా ప‌దుకొనే, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ , దిశా ప‌టానీ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌డం విశేషం.

Also Read: Keerthy Suresh Vs Anupama Parameswaran

Comments (0)
Add Comment