Hero Prabhas-Kalki 2 : షూటింగ్ లో డార్లింగ్ ప్ర‌భాస్ బిజీ

నాగ్ అశ్విన్ క‌ల్కి-2 మూవీ సీక్వెల్

Prabhas : టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌ల్కి సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్ర‌భాస్ తో పాటు అందాల తార దీపికా ప‌దుకొనే కూడా న‌టించింది. ఇదే స‌మ‌యంలో భారీ స‌క్సెస్ అందుకోవ‌డంతో క‌ల్కి చిత్రానికి సంబంధించి మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నిర్మాత అశ్విని ద‌త్ సీక్వెల్ ను తీస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Hero Prabhas Kalki 2 Movie Updates

ఈ మేర‌కు డార్లింగ్ ప్ర‌భాస్(Prabhas) క‌ల్కి-2 మూవీ చిత్రం షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి 25 శాతం షూటింగ్ కూడా పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఇంకా 75 శాతం షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. సంక్రాంతి పండుగ పూర్తి కావ‌డంతో ప్ర‌భాస్ నేరుగా షూటింగ్ లోకి వెళ్లాడు. ప్ర‌స్తుతం త‌న చేతిలో మ‌రో రెండు సినిమాలు ఉన్నాయి.

డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాజా సాహెబ్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి చెందిన ట్రైల‌ర్ , పోస్ట‌ర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ప్ర‌త్యేకించి మారుతి త‌న‌దైన స్టైల్ లో ప్ర‌భాస్ ను చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌ధానంగా ల‌వ‌ర్ బాయ్ గా చాన్నాళ్ల త‌ర్వాత డార్లింగ్ ను చూడ‌బోతున్నారు ఫ్యాన్స్.

రాజా సాహెబ్ ను వేస‌విలో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రో వైపు ఏప్రిల్ నెల‌లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించినున్న స్పిరిట్ షూటింగ్ లోకి ఎంట‌ర్ కానున్నారు ప్ర‌భాస్. మొత్తంగా ఈ కొత్త ఏడాదిలో భారీ బ‌డ్జెట్ తో సినిమాలు రాబోతున్నాయ‌న్న మాట‌.

Also Read : IT Raids Shocking Tollywood : టాలీవుడ్ లో ఐటీ దాడుల క‌ల‌క‌లం

KalkiPrabhasSequelTrendingUpdates
Comments (0)
Add Comment