Kalki 2898 AD OTT : ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న కల్కి 2898 ఏడి

కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతాయి...

Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’ దుమ్మురేపుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటూ ఇప్పటికి కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతుంది. జూన్ 27న విడుదలైన కల్కి సినిమా ప్రభాస్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ సినిమాను థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ రిపీట్ గా చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఇప్పట్లో రానట్టే అని తెలుస్తోంది.

Kalki 2898 AD OTT Updates

‘కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD)’ భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమా కోసం వైజయంతీ మూవీస్ 600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఇంత భారీ మొత్తంతో సినిమా తీసినప్పుడు భారీగా వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకే సినిమా థియేటర్‌లో ఎక్కువ రోజులు నడవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కల్కి సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో , నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. ఒకవేళ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయితే ఈ రెండు ఓటీటీల్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు.

కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతాయి. థియేటర్‌లో బిజినెస్ లేనప్పుడు ఓటీటీలో ఇలా రిలీజ్ చేస్తారు. అయితే, ‘కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD)’ విషయంలో అలా కాదు. రెండు నెలల తర్వాత నిర్మాతలు ‘కల్కి 2898ఏడీ’ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ‘ కల్కి 2898 ఏడీ’ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మహాభారతం కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ సినిమాను మరిన్ని పార్టులుగా తీసుకురానున్నారు నాగ్ అశ్విన్. ఇప్పటికే కల్కి పార్ట్ 2 షూటింగ్ చాలా వరకు అయ్యిందని తెలుస్తోంది.

Also Read : Sardar 2 Movie : కార్తి సర్దార్ 2 షూటింగ్ లో స్టంట్ మాన్ మృతి

Kalki 2898 ADOTTTrendingUpdatesViral
Comments (0)
Add Comment