Kalki 2898 AD Rajamouli : జక్కన్న ను కలవరపెడుతున్న ‘కల్కి 2898 ఏడి’ కలెక్షన్స్

ప్రభాస్‌ , అమితాబ్‌కు లీగల్ నోటిసులు వెళ్లే వరకు ఆ వివాదం ముదిరింది...

Kalki 2898 AD : నిన్న మొన్నటి వరకు రికార్డుల రారాజు జక్కన్న! అన్ బీటబుల్ ఎవర్ గ్రీన్ రికార్డులకు కేరాఫ్. కానీ రీసెంట్‌గా వచ్చిన ప్రభాస్ కల్కి(Kalki 2898 AD) మూవీ జక్కన్న మీద ఉన్న ఈ ట్యాగ్‌ను ఆల్మోస్ట్ గా తుడిచేసింది. దాదాపు చాలా ఏరియాల్లో ట్రిపుల్ ఆర్ రికార్డును బద్దలుకొట్టింది. దీంతో జక్కన్న తన నెక్ట్స్‌ సినిమాతో.. నయా రికార్డ్స్‌ సెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆప్టర్ ట్రిపుల్ ఆర్ ఇప్పటికే ఆయనపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్.. అందుకు తోడు పక్కనే ఉన్న మహేష్. ఇప్పుడు కల్కి రికార్డ్స్‌! దీంతో… ఈ స్టార్ డైరెక్టర్ తన అప్‌ కమింగ్ సినిమా కోసం ఓ రేంజ్‌లో కష్టపడుతున్నారనే టాక్ తాజాగా బయటికి వచ్చింది.

Kalki 2898 AD Issues

ప్రభాస్‌ కల్కి మూవీ వివాదంలో చిక్కుకుంది. ప్రభాస్‌ , అమితాబ్‌కు లీగల్ నోటిసులు వెళ్లే వరకు ఆ వివాదం ముదిరింది. కల్కి మూవీలో కల్కి భగవానుడి గురించి గ్రంథాలకు భిన్నంగా తప్పుగా చూపించారని కల్కి ధామ్‌ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం తాజాగా కోర్టు మెట్లెక్కారు. ప్రభాస్, అమితాబ్‌తో పాటు ఈ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపారు. దీపిక కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నట్లు చూపించి వందల కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. అంతేకాదు హిందూ గ్రంథాలను సినిమాల్లో కథలుగా వాడుకోవడం.. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందంటూ.. ఆచార్య ప్రమోద్ కృష్ణం ఫిల్మ్ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తి చేశారు.

Also Read : Hero Ajith Kumar : షూటింగ్ పూర్తి చేసుకున్న అజిత్ ‘విడా ముయార్చి’ సినిమా

CollectionsCommentsKalki 2898 ADRajamouliViral
Comments (0)
Add Comment