Kalinga: ధృవ వాయు ప్రధాన పాత్రధారిగా నటిస్తూ… స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. ఆడుకాలం నరేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌నీ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Kalinga Movie Updates
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… ‘‘కాన్సెప్ట్ ప్రధానంగా సాగే చిత్రమిది. లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచే సినిమా అవుతుందని తెలిపారు. ఈ సినిమాకి అక్షయ్ రామ్ పొడిశెట్టి కేమరామెన్ గా వ్యవహరిస్తుండగ… విష్ణు శేఖర సంగీతం అందిస్తున్నారు.
Also Read : Brad Pitt: రేసింగ్ కిక్ నిచ్చేలా ‘ఎఫ్1’ సినిమా !