Kalanithi Maran : ర‌జ‌నీకి భారీ రెమ్యున‌రేష‌న్

చెక్కును ఇచ్చిన క‌ళానిధి మార‌న్

Kalanithi Maran : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ మూవీ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ర‌జ‌నీకాంత్ తో జైల‌ర్ చిత్రం నిర్మించారు. ఇది ఆశించిన దాని కంటే కోట్లు కొల్ల‌గొట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్టు 10న విడుద‌లైంది. ఇందులో భాగంగా సూప‌ర్ స్టార్ మేనియా దెబ్బ‌కు జైల‌ర్ రికార్డుల మోత మోగిస్తోంది.

Kalanithi Maran Gift

ఒక్క త‌మిళ‌నాడులోనే చిత్రం రూ. 220 కోట్ల‌ను దాటేసింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్ర‌స్తుతానికి అందిన స‌మాచారం మేర‌కు రూ. 650 కోట్ల క్ల‌బ్ లోకి చేరింది. ర‌జ‌నీకాంత్ సినీ కెరీర్ లో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన చిత్రంగా నిలిచి పోయింది జైల‌ర్.

ప్రారంభంలో కొంత డివైడ్ టాక్ వ‌చ్చినా ఆ త‌ర్వాత విడుద‌లైన అన్ని చోట్లా జైల‌ర్ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. తాజాగా నిర్మాత క‌ళానిధి మార‌న్(Kalanithi Maran) స్వ‌యంగా ర‌జ‌నీకాంత్ నివాసానికి వెళ్లారు. ఆయ‌న ఏకంగా రూ. 100 కోట్ల చెక్ ను త‌లైవాకు అందజేసిన‌ట్లు స‌మాచారం.

ఈ చెక్కు చెన్నై లోని సిటీ యూనియ‌న్ బ్యాంక్ బండ‌వేలి బ్రాంచ్ కు చెందిన‌ది కావ‌డం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.

Also Read : Kalanithi Maran : ర‌జ‌నీకి భారీ రెమ్యున‌రేష‌న్

Comments (0)
Add Comment