P Susheela: ప్రముఖ గాయని సుశీలకు కలైజ్ఞర్‌ స్మారక అవార్డు !

ప్రముఖ గాయని సుశీలకు కలైజ్ఞర్‌ స్మారక అవార్డు !

P Susheela: ప్రముఖ గాయని గాన కోకిల పి. సుశీలకు ‘కలైజ్ఞర్‌ స్మారక కళా విభాగం స్పెషలిస్ట్‌’ అవార్డును తమిళనాడు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దివంగత డీఎంకే అధినేత కరుణానిధి పేరిట తమిళనాడు ప్రభుత్వం తమిళాభివృద్ధి విభాగం నేతృత్వంలో కలైజ్ఞర్‌ నినైవు కళై తురై విత్తగర్‌ అవార్డుని (కలైజ్ఞర్‌ స్మారక కళా విభాగం స్పెషలిస్టు లేదా నిపుణులు) ఒకరికి ప్రదానం చేయడానికి 2022లో నిర్ణయించారు. మొదటి అవార్డు తిరువారూర్‌ ఆరూర్దాస్‌కు దక్కింది.

P Susheela Got Award

గత ఏడాది మొత్తం కరుణానిధి శత జయంతి ఉత్సవాలు జరగడంతో ఈ అవార్డుని 2023కుగాను మహిళా ప్రముఖురాలికి ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఈ అవార్డుకు పి. సుశీలను ఎంపిక చేసింది కమిటీ. అలాగే తమిళ భాషాభివృద్ధి కోసం శ్రమిస్తున్న రచయిత, కవి మహ్మద్‌ మెహతాను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 30న తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ చేతులమీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

పి సుశీల పూర్తి పేరు పులపాక సుశీల(P Susheela). ఆరు దశాబ్దాలకు పైగా దక్షిణ భారత సినిమాతో అనుబంధం ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఒక భారతీయ నేపథ్య గాయని మరియు “భారత సినిమా యొక్క ఎవర్‌ గ్రీన్ నైటింగేల్”గా గుర్తింపు పొందింది. ఆమె భారతదేశంలోని గొప్ప మరియు ప్రసిద్ధ నేపథ్య గాయకులలో ఒకరు. వివిధ భారతీయ భాషల్లో రికార్డు స్థాయిలో పాటలు పాడినందుకు ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ తో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది . ఆమె ఉత్తమ నేపథ్య గాయనిగా ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు అనేక రాష్ట్ర అవార్డులను కూడా అందుకుంది .

1969లో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది . జాతీయ అవార్డు గెలుచుకున్న దేశంలో మొదటి మహిళా గాయని సుశీల(P Susheela). ఆరు దశాబ్దాలకు పైగా ఉన్న కెరీర్‌లో, ఆమె తెలుగు , తమిళం , కన్నడ , మలయాళం , హిందీ , బెంగాలీ , ఒడియా , సంస్కృతం , తుళు మరియు బడగాతో సహా వివిధ భారతీయ భాషలలో దాదాపు 17695 పాటలను రికార్డ్ చేసింది . ఆమె సింహళ చిత్రాలకు కూడా పాడింది . ఆమె మాతృభాష తెలుగు . హిందీ , మలయాళం మరియు కన్నడ భాషలలో కొంచెం పరిజ్ఞానం ఉన్న ఆమె తమిళం కూడా అనర్గళంగా మాట్లాడగలదు .

Also Read : Devara: కొంప ముంచిన ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు ! నోవాటెల్ కు రూ. 33 లక్షల ఆస్థి నష్టం !

Kalaithurai Vithakar AwardP Susheela
Comments (0)
Add Comment