Kajol : బుల్లి తెర‌పై కాజోల్ సంద‌డి

వెబ్ సీరీస్ లో రెచ్చి పోయిన న‌టి

బాలీవుడ్ లో ప్ర‌ముఖ న‌టిగా ఉన్న కాజోల్ ఉన్న‌ట్టుండి సెకండ్ ఇన్నింగ్స్ ను డిఫ‌రెంట్ గా స్టార్ట్ చేశారు. గ‌తంలో ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో న‌టించారు. ఆమె న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ ను పెళ్లి చేసుకుంది. పిల్ల‌లు కూడా. తాజాగా ఓటీటీ ప్లాట్ ఫార‌మ్స్ ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీంతో ట‌బు, నీనా గుప్తా, సోనాలి బెంద్రే, కాజోల్ లాంటి వాళ్లు మళ్లీ బిజీగా మారి పోయారు. మాధురి దీక్షిత్ అయితే రియాల్టీ షోస్ తో ఆక‌ట్టుకుంటోంది.

ఇక కాజోల్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆమె ఇటీవ‌ల వెబ్ సీరీస్ లో న‌టించింది. ల‌స్ట్ సీరీస్ లో రెచ్చి పోయి న‌టించింది. బెడ్ సీన్స్ తో పాటు ముద్దుల హ‌ద్దుల‌ను చెరిపేసింది కాజోల్. ఆమెకు ఇప్పుడు 49 ఏళ్లు. ఆగ‌స్టు 5 , 1974 లో మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో పుట్టింది. 1992 నుండి 2012 దాకా బాలీవుడ్ లో నెంబ‌ర్ 1 న‌టిగా పేరు తెచ్చుకుంది. గ‌త ఏడాది నుంచి వెబ్ సీరీస్ తో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది కాజోల్.

ఇక బాద్ షా షారుక్ ఖాన్ , కాజోల్ జోడి హిట్ పెయిర్ గా నిలిచింది. వీరిద్ద‌రు న‌టించ‌న ప్ర‌తి చిత్రం స‌క్సెస్ సాధించింది. దిల్ వాలే దుల్హ‌నీయా లేజాయింగే చిత్రం భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. ఆమె త‌ల్లి ఎవ‌రో కాదు ప్ర‌ముఖ న‌టి త‌నూజ‌. ఏ మాత్రం స‌మ‌యం చిక్కినా వెంట‌నే పుస్త‌కాల‌ను చ‌దువుతూ ఉంటుంది కాజోల్.

Comments (0)
Add Comment