నెట్టింట కాజోల్ న్యూడ్ వీడియో ?
Kajol : హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో షాక్ నుంచి తేరుకోకముందే మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ఫేక్ వీడియో సినీ తారలను ఆందోళనకు గురిచేస్తుంది. బాలీవుడ్ నటి కాజోల్ న్యూడ్ వీడియో అంటూ డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ ద్వారా సృష్టించిన ఓ ఫేక్ వీడియో పలు సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతోంది. ‘గెట్ రెడీ విత్ మీ’ అంటూ ఓ సోషల్‌మీడియా తార పోస్ట్ చేసిన వీడియోకు డీప్‌ఫేక్ వీడియో టెక్నాలజీ సహాయంతో కాజోల్ ముఖాన్ని ఉపయోగించి ఫేక్ వీడియో సృష్టించినట్లు తెలుస్తోంది. తరువాత కాజోల్ డ్రెస్ ఛేంజింగ్ వీడియో అంటూ దీనిని నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం ఇది ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ డీప్ ఫేక్ వీడియోపై పలువురు సినీతారలు ఆందోళన చెందుతున్నారు. ఫేక్ వీడియోలతో సినీతారలను, సెలబ్రెటీలను టార్గెట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్మికలాంటి యంగ్ హీరోయిన్లతో పాటు కాజోల్ లాంటి సీనియర్లను కూడా టార్గెట్ చేయడం ఏంటని మండిపడుతున్నారు.
Kajol – కాజోల్ కొంప ముంచిన డీప్ ఫేక్ టెక్నాలజీ
కాజోల్ న్యూడ్ వీడియో పేరుతో గ్లామరస్‌క్యూబ్ ఖాతా ద్వారా 11 సెకన్ల నిడివి గల వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. కాజోల్(Kajol) బికినీ వీడియో పేరుతో 1మింట్ ఆర్ట్ ఖాతా ద్వారా యూట్యూబ్‌లో కూడా ఇలాంటి వీడియో షేర్ చేయబడింది. చాలా మంది యూజర్లు ఈ వీడియోను కాజోల్‌దే అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోను నిశితంగా పరిశీలించగా, అది డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేసిన ఫేక్ వీడియో అని స్పష్టమైంది.
సోషల్ మీడియా స్టార్ పోస్ట్ చేసిన వీడియో కాజోల్ ముఖం ?
ఈ ఏడాది జూన్ నెలలో టిక్‌టాక్ వేదికగా ఓ సోషల్‌మీడియా స్టార్ పోస్ట్ చేసిన వీడియోకు డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ ద్వారా కాజోల్ ముఖాన్ని మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా స్టార్ షేర్ చేసిన వీడియోను ట్విట్టర్ లో ఇప్పటికే లక్ష మంది కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఆ వీడియోను ఉపయోగించి కాజోల్(Kajol) ఇమేజ్‌కు ఇబ్బంది కలిగించేలా ఈ వీడియో క్రియేట్ చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
టెక్నాలజీను దుర్వినియోగం చేస్తున్న ఆకతాయిలు
ఆధునిక టెక్నాలజీను దుర్వినియోగం చేస్తూ పలువురు ఆకతాయిలు ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల సోషల్‌మీడియా స్టార్ జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసారు. దీనితో ఈ వీడియోపై అమితాబ్ బచ్చన్, కీర్తిసురేశ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఘటన మర్చిపోక ముందే కాజోల్‌కు(Kajol) సంబంధించిన మార్ఫింగ్ వీడియో తాజాగా వైరల్ కావడం సినీ తారలను కలవరపెడుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఐటీ శాఖను డిమాండ్ చేస్తున్నారు.
Also Read : Ranabir Kapur: కోహ్లీ బయోపిక్ పై రణబీర్ ఆశక్తిక వ్యాఖ్యలు