సినిమా రంగంలో ఎవరికి ఎప్పుడు డిమాండ్ ఉంటుందో చెప్పలేం. గతంలో కొందరే ఉండే వారు. కానీ ఇప్పుడు అలా కాదు. రోజుకో కొత్తగా ఈ ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. దీంతో చెప్పలేనంత పోటీ నెలకొంటోంది. ఈ తరుణంలో సినిమాలలో నటిస్తూనే ఉన్నప్పటికీ యంగ్ గా ఉన్న వాళ్లకే ప్రయారిటీ ఇస్తారు దర్శక, నిర్మాతలు.
ఇది టాలీవుడ్, కోలీవుడ్ , శాండిల్ వుడ్ , బాలీవుడ్ రంగాలకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. పెళ్లి కాని వాళ్లకు, అందాల ఆరబోతతో ఆకట్టుకునే వాళ్లకే గుర్తింపు ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం.
పురుషుల డామినేషన్ ఎక్కువ ప్రస్తుత సినిమా రంగంలో. ఇది పక్కన పెడితే తాజాగా ఈ ఏడాది ఇద్దరు నటీమణులు హాట్ టాపిక్ గా మారారు. వారు తమ నటనతో ఆకట్టుకున్నారు. విచిత్రం ఏమిటంటే వారిద్దరూ పిల్లలకు తల్లులు కావడం . వారెవరో కాదు ఒకరు తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ నయన తార. ఆమెకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు.
ఈ అమ్మడు తాజాగా అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం జవాన్ లో దుమ్ము రేపింది. షారుక్ ఖాన్ కు పోటా పోటీగా నటించింది. ఆమె నటనకు వంద మార్కులు పడ్డాయి. చివరకు పిల్లల తల్లి అంటే ఎవరూ నమ్మలేక పోయారు.
ఇక మరో నటి కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పెళ్లి చేసుకుంది. ఓ బాబుకు తల్లి అయ్యింది. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంత్ కేసరి చిత్రంలో డాక్టర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో బాలయ్య బాబు, శ్రీలీలతో పాటు తను కూడా నటిస్తోంది. సో కొత్తగా వచ్చే నటీమణులతో ఈ ముద్దుగుమ్మలు పోటీ పడుతుండడం విశేషం.