Beauty Kajal Aggarwal : కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండియ‌న్ స్టోరీ షురూ

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన బాలీవుడ్ న‌టి

Kajal Aggarwal : సినిమా రంగంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లాయ‌క సినిమాల‌కు దూరంగా ఉంటారు. అడ‌పా ద‌డ‌పా న‌టిస్తుంటారంతే. కానీ బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్(Kajal Aggarwal) మాత్రం ఇందుకు భిన్నంగా ప‌లు సినిమాల‌లో న‌టిస్తూ బిజీగా మారింది. ఇటు తెలుగులో అటు హిందీలో ఆమె సినిమాల‌కు సంత‌కాలు చేసింది.

Kajal Aggarwal Movie Updates

సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ ఇచ్చింది. త‌ను కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్న ది ఇండియా స్టోరీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. దీనిని వ‌చ్చే ఆగ‌స్టు 15న రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే బాలీవుడ్ లో తార‌క్ , హృతిక్ రోష‌న్ క‌లిసి న‌టించిన వార్ 2 కూడా అదే రోజు రానుంది. దీంతో ఆ సినిమాకు తాము గ‌ట్టిపోటీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం విశేషం. మ‌రో వైపు ఇండియ‌న్ స్టోరీ క‌థ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని, త‌న పాత్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొంది న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్.

ఇవాళ పూణేలో సినిమా తొలి షూటింగ్ ను ప్రారంభించామ‌న్నారు. కాగా ఈ న్యూ మూవీలో శ్రేయాస్ త‌ల్పాడే, ముర‌ళీ శ‌ర్మ కూడా కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ఎంఐజీ ప్రొడ‌క్ష‌న్ అండ్ స్టూడియోస్ ఆధ్వ‌ర్యంలో సాగ‌ర్ షిండే నిర్మిస్తున్నారు. కొల్హాపూర్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా కాజ‌ల్ చేసిన ఫోటోస్ వైర‌ల్ గా మారాయి.

Also Read : Beauty Zanai Bhosle : త‌ను ప్రేమికుడు కాదు సోద‌రుడు

CinemaKajal AggarwalTrendingUpdates
Comments (0)
Add Comment