Nitya Menon: తమిళంలో జయం రవి , నిత్యా మీనన్(Nitya Menon) కలిసి నటించిన కాదలిక్క నేరమిల్లై అద్భుతమైన విజయాన్ని స్వంతం చేసుకుంది. ఇద్దరూ పోటా పోటీగా తమ పాత్రలకు జీవం పోశారు. దీనిని పూర్తిగా రొమాంటిక్, కామెడీ నేపథ్యంతో తెరకెక్కించాడు దర్శకుడు. మూవీ మేకర్స్ కు ఆశించిన దాని కంటే కలెక్షన్స్ వచ్చాయి.
Nitya Menon Movie in OTT
కాదలిక్క నేరమిల్లై మూవీని దక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు పెద్ద ఎత్తున పోటీ పడ్డాయి. చివరకు నెట్ ఫ్లిక్స్ స్వంతం చేసుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 11న అలరించేందుకు వస్తోందని, రెడీగా ఉండాలని కోరింది.
దీంతో థియేటర్లలో చూడలేని వారంతా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జయం రవి, నిత్యా మీనన్ అత్యంత నేచురల్ గా నటించారు. సినిమా పరంగా సిద్దార్త్, శ్రియ చుట్టూ కథ తిరుగుతుంది. శ్రియ మాతృత్వాన్ని బలంగా నమ్ముతుంది. కానీ సిద్దార్థ్ పిల్లలను కనేందుకు విముఖతతో ఉంటాడు. విభిన్న సిద్దాంతాలు, అభిప్రాయాలు ఉన్నప్పటికీ విధి వారి జీవితాన్ని కలిసేలా చేసింది.
ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపింది నెట్ ఫ్లిక్స్. నెటిజన్లు మాత్రం స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కాదలిక నేరమిల్లై చిత్రానికి కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించాడు. జయం రవి, నిత్యా మీనన్ తో పాటు యోగి బాబు, వినయ్ రాయ్, టీజే భాను, జాన్ కొక్కెన్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
Also Read : Thandel Success : వారెవ్వా తండేల్ కలెక్షన్స్ జిగేల్