Kabzaa: ఉపేంద్ర ‘కబ్జ’ సినిమాకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అభినందనలు !

ఉపేంద్ర 'కబ్జ' సినిమాకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అభినందనలు !

Kabzaa: శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్‌ చంద్రు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా సినిమా ‘కబ్జ(Kabzaa)’. ప్రముఖ కన్నడ నటులు ఉపేంద్ర , సుదీప్‌ , శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ మల్టీస్టారర్‌ 2023 మార్చి 17న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా కన్నడలో భారీగా ప్రేక్షకాధరణ పొందింది. అయితే బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయనప్పటికీ నష్టాలు అయితే రాలేదు. అయితే, ఈ డిజాస్టర్ సినిమాకు కూడా సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. అయితే బాక్సాఫీసు వద్ద నిరాశ మిగిల్చిన ఈ సినిమాకు… నిర్మాత, దర్శకుడు అయిన ఆర్‌. చంద్రుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసా పత్రంతో సత్కరించింది.

Kabzaa Movie…

శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై కబ్జ(Kabzaa) సినిమాను ఆర్‌. చంద్రు నిర్మించారు. పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను పూర్తిగా ఆయన క్లియర్‌ చేశాడు. దీనితో ఆర్.చంద్రు నిర్మాణ సంస్థకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసా పత్రం జారీ చేసింది. పన్ను బకాయిలు పెట్టకుండా ఆ శాఖకు రికార్డు స్థాయిలో డబ్బు చెల్లించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసా పత్రాన్ని ఆయన అందుకున్నారు. ఈ సినిమా నిర్మాత శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్‌ప్రైజెస్‌కి ఇప్పుడు అత్యధిక పన్ను కట్టిన ఘనత దక్కింది.

ఈ బ్యానర్‌పై ఐదు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్.చంద్రు కన్నడ సక్సెస్‌ఫుల్ దర్శకుల్లో ఒకరిగా పేరు పొందారు. చిక్కబళ్లాపూర్‌ లోని ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రు ఈరోజు సినీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ కాలంలో దర్శకుడిగా విజయం సాధించడం అనేది చాలెంజింగ్‌తో కూడుకున్న పని. అయినప్పటికీ, అతను ప్రేక్షకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించాడు. తమ సొంత బ్యానర్ ద్వారా కూడా కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన కన్నడ సినీ అవార్డ్స్‌లో ‘కబ్జా’ ఉత్తమ VFX పోస్ట్ ప్రొడక్షన్, యానిమేషన్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. 1960 కాలం నేపథ్యంలో సాగే కథతో ఈ కబ్జ చిత్రాన్ని తెరకెక్కించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది.

Also Read : Hero Yash : డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో వస్తున్న యాష్ మరో మూవీ

Kabzaakitcha sudeepUpendra
Comments (0)
Add Comment