Kabir Duhan Singh : చేసేది విలన్ పాత్రలైనా పెదవాళ్ళకి మాత్రం ఆయనొక హీరో

ఈ మధ్యకాలంలో వస్తోన్న స్టార్ హీరోల సినిమాలన్నింటిలోనూ కబీర్ కనిపిస్తూనే ఉన్నారు...

Kabir Duhan Singh : కబీర్ దుహన్ సింగ్.. ఈ పేరు వినగానే తెరపై కరుడు కట్టిన విలన్ గుర్తొస్తాడు. కానీ ఆయన చేసే పని గురించి తెలిస్తే.. ఆయనకి సెల్యూట్ కొట్టి ఫ్యానిజం చేస్తారు. ఇంతకీ కబీర్ దుహన్ సింగ్(Kabir Duhan Singh) ఏం చేశాడని, గొప్పలు చెబుతున్నారని అనుకుంటున్నారు కదా! ఆ విషయం తెలుసుకునే ముందు.. 2015లో గోపీచంద్ హీరోగా నటించిన ‘జిల్’ సినిమాతో టాలీవుడ్‌లో విలన్‌గా అరంగేట్రం చేసిన ఈ నటుడు.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. స్టార్ హీరోల సినిమాలలో సైతం ఆయనకిప్పుడు ఓ పాత్ర రెడీగా ఉంటుంది. అలాంటి నేమ్‌ని కబీర్ సొంతం చేసుకున్నాడు.

Kabir Duhan Singh…

‘సర్దార్ గబ్బర్ సింగ్, వేదాళం, కిక్ 2’ ఇలా ఒకటేమిటి.. ఈ మధ్యకాలంలో వస్తోన్న స్టార్ హీరోల సినిమాలన్నింటిలోనూ కబీర్ కనిపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ అనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ విలన్ స్టేటస్‌ని అనుభవిస్తున్నారు. అయితే రీల్ లైఫ్‌లో ఆయన విలన్‌గా నటించినా.. రియల్ లైఫ్‌లో మాత్రం ఆయన నిజంగా హీరోనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఆయన ప్రతి సినిమాకు పాటించే రూల్.. ఆయనని రియల్ లైఫ్‌లో హీరోని చేసింది.

కబీర్దుహన్ సింగ్ ఏ సినిమాకైనా సైన్ చేసి, మొదటి చెక్ అందగానే మరుసటి రోజు పేదవారందరికీ పిలిచి భోజనం పెడతారట. ఇది ఇప్పటిది కాదు.. దాదాపు ఆయన ప్రతి సినిమాకు మొదటి చెక్ అందుకున్న ప్రతిసారి, ఇలా పేదలకు మంచి భోజనం పెట్టిస్తూ వస్తున్నారట. ఈ విషయం తెలిసిన వారంతా.. ఆయనది ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప నిర్ణయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమే.. తెరపై విలన్‌గా కనిపిస్తే.. రియల్ లైఫ్‌లోనూ విలన్‌గానే ఉండాలని రూలేం లేదు కదా. ఇంకా చెప్పాలంటే విలన్‌గా చేసే వారికే గొప్ప మనసు ఉంటుందని ఇప్పటికే చాలా మంది విలన్ పాత్రదారులు నిరూపించారు. ఎస్.వి. రంగారావు, ప్రభాకర్ రెడ్డి, సోనూసూద్.. ఇలా విలన్ పాత్రలు వేసిన వారంతా ప్రజలతో కీర్తింపబడిన వారే. ఇప్పుడా లిస్ట్‌లోకి కబీర్ దుహన్ సింగ్(Kabir Duhan Singh) కూడా చేరారు.

Also Read : Bipasha Basu : క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ

HelpingKabir Duhan SinghTrendingUpdatesViral
Comments (0)
Add Comment