Kaatera OTT : మరో రెండు భాషల్లో ఓటీటీలో రానున్న ‘కాటేరా’ సినిమా

ఈ సినిమా గతేడాది డిసెంబర్ 29న విడుదలైంది....

Kaatera : 1970లో కర్ణాటకలోని ఓ గ్రామంలో జరిగిన యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘కాటేరా’. ఇందులో ప్రధాన పాత్రధారి దర్శన్. మాలాశ్రీ కూతురు ఆరాధనా రామ్ కథానాయికగా తెరంగేట్రం చేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు.

Kaatera OTT Updates

ఈ సినిమా గతేడాది డిసెంబర్ 29న విడుదలైంది. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. 100 కోట్ల వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం ఇప్పటికే జీ5 OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతోంది. తాజాగా తెలుగు, తమిళ వెర్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. జీ5 సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆదివారం నుంచి తెలుగు, తమిళ భాషల్లో ‘కాటేరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Sonu Sood : స్విగ్య్ డెలివరీ బాయ్ కి అండగా ఉన్న సోనూసూద్ పై మండిపడుతున్న ఫ్యాన్స్

KaateraOTTTrendingUpdatesViral
Comments (0)
Add Comment