Creative -K Raghavendra Rao : ఒరేయ్ బుల్లి రాజు నీ వ‌ల్లేరా ఇదంతా

ప్ర‌శంస‌లు కురిపించిన రాఘ‌వేంద్ర‌రావు

Raghavendra Rao : ఇప్పుడంతా బుల్లి రాజు జ‌పం చేస్తున్నారు జ‌నం. దీనికి కార‌ణం ఇంటిల్లిపాది న‌వ్వుకునేలా చేసే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి ద‌క్కుతుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో విక్ట‌రీ వెంక‌టేశ్, ల‌వ్లీ బ్యూటీస్ మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ ల‌తో సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా తీశాడు. ఇది ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బిగ్ స‌క్సెస్ అయ్యింది. విక్ట‌రీ వెంకీ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Raghavendra Rao Appreciates

ఓ వైపు మెగా ఫ్యామిలీ నుంచి చెర్రీ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌గా ఎలాంటి అంచ‌నాలు లేకుండానే సంక్రాంతికి వ‌స్తున్నాం రిలీజ్ అయ్యింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకు పోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో రూ. 330 కోట్ల‌ను అధిగ‌మించింది. త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ లాభం ఆర్జించింది. ఓ ర‌కంగా గేమ్ చేంజ‌ర్ ను కూడా నిర్మించింది దిల్ రాజే కావ‌డం విశేషం. ఆ ఒక్క మూవీని భారీ బ‌డ్జెట్ తో నిర్మించాడు. రూ. 500 కోట్లు ఖ‌ర్చు చ‌సిన‌ట్లు టాక్.

ఇది ప‌క్క‌న పెడితే సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ మేక‌ర్స్ స‌క్సెస్ మీట్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌కులు కె. రాఘ‌వేంద్ర రావు(Raghavendra Rao), పైడిప‌ల్లి వంశీ, హ‌రీశ్ శంక‌ర్ హాజ‌ర‌య్యారు. రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌త్యేకంగా సినిమాలో న‌టించి మెప్పించి..న‌వ్వించేలా చేసిన బోడ్డోడు బుల్లి రాజు అలియాస్ రేవంత్ గురించి ప్ర‌శంస‌లు కురిపించారు. ఒరేయ్ బుల్లి రాజు నీ వ‌ల్లేరా ఇదంతా అంటూ కితాబు ఇచ్చారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కేంద్రుడు చేసిన ఈ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

ఇప్ప‌టికే ఈ మూవీ హిట్ కావ‌డంతో ఇందులో కీల‌క పాత్ర పోషించిన బుల్లి రాజుకు సినిమా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని టాక్.

Also Read : Vamshi Paidipally- Hero Venkatesh :చేసిన పుణ్యం సినిమాకు విజ‌యం

CommentsK Raghavender RaoTrending
Comments (0)
Add Comment