Jr NTR : ఎన్టీఆర్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించిన ఎన్టీఆర్ టీమ్

ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి టీమ్ విడుదల చేసిన విషయం ఏమిటంటే....

Jr NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మంగళవారం ‘దేవర’ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ షూటింగ్ పూర్తయినట్లుగా వార్త వచ్చిందో, లేదో.. ఆయనకు పెద్ద ప్రమాదం జరిగిందని, బాగా గాయాలు అయ్యాయనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్(Jr NTR) ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురై, హాస్పిటల్ ఉన్నారనే వార్తలతో ఒక్కసారిగా సోషల్ మీడియా షేకయింది. అయితే వెంటనే ఎన్టీఆర్ టీమ్ ఈ వార్తలపై రియాక్ట్ అయింది. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది.

Jr NTR Health..

ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి టీమ్ విడుదల చేసిన విషయం ఏమిటంటే.. ‘‘కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్(Jr NTR) జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా అతని చేతికి చికిత్స అందించడం జరిగింది. తన చేతికి గాయమైనప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవర షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు కోలుకుంటున్నారు. రెండు వారాల విరామం అనంతరం ఎన్టీఆర్ మరలా వర్క్‌లో పాల్గొంటారు. ఈ చిన్న గాయానికి సంబంధించి ఊహాగానాలు నివారించాలని అభ్యర్థిస్తున్నాము..’’ అని అఫీషియల్ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్ చేతికి కట్టు ఉన్న ఫొటోని కూడా షేర్ చేసి, ఆయనపై వినిపిస్తున్న వార్తలకు బ్రేక్ వేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘దేవర పార్ట్ 1’షూటింగ్‌ని పూర్తి చేశారు. మంగళవారం రాత్రి ‘దేవర పార్ట్ 1’కి సంబంధించి చివరి షాట్ చేసినట్లుగా ప్రకటిస్తూ.. సముద్రమంత ప్రేమను, అద్భుతమైన టీమ్‌ను మిస్సవుతున్నట్లుగా ప్రకటించారు. సెప్టెంబర్ 27న కొరటాల శివ రెడీ చేస్తున్న ‘దేవర’ ప్రపంచంలోకి అందరితో కలిసి ప్రయాణించడానికి ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇంతలోనే ఇలాంటి వార్తలు ఆయనపై పుట్టుకురావడం విచారకరం. అయితే ఆలస్యం చేయకుండా టీమ్ రియాక్ట్ అవడంతో.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ దేవర పార్ట్ 1’ పూర్తి చేసిన ఎన్టీఆర్.. బాలీవుడ్ ఫిల్మ్ ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు ప్రశాంత్ నీల్‌ తో రీసెంట్‌గానే ఓ చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారు.

Also Read : Bunny Vas : ఆ రోజు అల్లు అర్జున్ లేకుంటే నేను ఇలా ఉండేవాడిని కాదు

BreakingCommentsHealthJr NTRViral
Comments (0)
Add Comment