Jr NTR: తన తల్లితో కలిసి కుందాపురంలో పర్యటించిన జూనియర్ ఎన్టీఆర్ !

తన తల్లితో కలిసి కుందాపురంలో పర్యటించిన జూనియర్ ఎన్టీఆర్ !

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తన తల్లితో కలిసి శనివారం ఉడుపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించారు. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, కన్నడ నటుడు రిషబ్‌శెట్టి కూడా తారక్‌తో ఉన్నారు. దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ‘అమ్మ ఎప్పుడూ నన్ను తన సొంతూరు కుందాపురాతోపాటు, ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనానికి వెళదామని అడుగుతుంటుంది. ఇప్పుడు ఆమె కల నెరవేరింది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజు ముందు నేను ఆమెకు ఇచ్చే మంచి బహుమతి ఇదే.

Jr NTR Visit

విజయ్‌ కిరంగదూర్‌ సర్‌.. మీకు ధన్యవాదాలు. నా ప్రియమిత్రుడు ప్రశాంత్‌ నీల్‌ తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే రిషబ్‌ శెట్టి కూడా వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అని ఎక్స్‌ వేదికగా ఎన్టీఆర్‌(Jr NTR) ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం తారక్‌… కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ‘దేవర’లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమలో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబరు 27న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అంతే కాదు బాలీవుడ్‌లో ‘వార్‌2’లో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. తరువాత ప్రశాంత్‌ నీల్‌ తో సినిమా చేయబోతున్నారు.

Also Read : Mahesh Babu: సుకుమార్ భార్యను ప్రశంసలతో ముంచెత్తిన మహేశ్ బాబు !

Jr NTRKundapuraprasanthneel
Comments (0)
Add Comment