Jr NTR : దేవరకు కాస్త బ్రేక్ ఇచ్చి వార్ 2 షూటింగ్ చేస్తున్న తారక్

ఇప్పటికిప్పుడు జాన్వీ సెట్స్ కి వచ్చేద్దాం... ఆ రెండు పాటలను షూట్‌ చేసేద్దాం అన్నా...

Jr NTR : ఇండస్ట్రీలో ఇప్పుడు మరింత యాక్టివ్‌ అవుతున్నారు తారక్‌(Jr NTR) ఫ్యాన్స్. దేవర రిలీజ్‌కి కౌంట్‌డౌన్‌ స్టార్ట్ కావడంతో ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. దేవర కోసం నిశితంగా గమనిస్తున్న వారికి ఇంకో గుడ్‌న్యూస్‌ తెలిసింది… ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఇంకేం తెలిసింది…. చూసేద్దాం వచ్చేయండి… మా సినిమా పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి. అందుకే మేం ఓ అడుగు ముందే మిమ్మల్ని పలకరించడానికి రెడీ అయిపోతున్నాం అంటూ ఆ మధ్య హ్యాపీగా అనౌన్స్ చేసింది దేవర టీమ్‌. ఇప్పుడు కూడా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసేశారు కొరటాల శివ. ఇంకో రెండు పాటలు చిత్రీకరిస్తే షూటింగ్‌ పూర్తయినట్టే. షూటింగ్‌కి తగ్గట్టు ట్రాక్స్ కూడా పంపేశారట అనిరుద్‌. అయితే జాన్వీ హెల్త్ డిస్టర్బ్ కావడంతో సాంగ్స్ షూటింగ్‌ పెండింగ్‌ పడింది. దేవర చిత్రీకరణకు బ్రేక్‌ వచ్చింది.

Jr NTR Movies Update

ఇప్పటికిప్పుడు జాన్వీ సెట్స్ కి వచ్చేద్దాం… ఆ రెండు పాటలను షూట్‌ చేసేద్దాం అన్నా… కుదరని పరిస్థితి. తారక్‌ ఇప్పుడు కొరటాల శివకు అందుబాటులో లేరు. అందుకే కొరటాల పోస్ట్ ప్రొడక్షన్‌ మీద ఫుల్‌ కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ముందే కమిట్‌ అయిన ప్రకారం తారక్‌ వార్‌2 సెట్స్ కి వెళ్తున్నారు. ప్రస్తుతం తారక్‌ కాల్షీట్‌ వార్‌2 మేకర్స్ దగ్గర ఉన్నాయి. భారీ స్టార్ కాస్ట్ తో ముడిపడిన షెడ్యూల్‌ కావడంతో తారక్‌ ఇప్పటికిప్పుడు వార్‌2 నుంచి వచ్చే పరిస్థితి లేదు. అయితే ఏమాత్రం గ్యాప్‌ దొరికినా… రెండు పాటలను కంప్లీట్‌ చేసేయాలనుకుంటున్నారు. ఈలోగా జాన్వీ కూడా కోలుకుంటే అన్నీ ట్రాక్‌లోకి వచ్చేసినట్టే అనుకోవచ్చు.

Also Read : Rao Ramesh : జంధ్యాల మార్కు చిత్రం ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ లో రావు రమేష్

Jr NTRMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment