Jr NTR : అతని దర్శకత్వంలో సినిమా పక్కా అంటున్న జూనియర్ ఎన్టీఆర్

అయితే తారక్‌ ఇదే ఇంటర్వ్యూలో కోలీవుడ్‌లోని మరికొందరు దర్శకుల గురించి మాట్లాడారు...

Jr NTR : యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘దేవర’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూతో ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. ‘ దేవర’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేస్తున్నారు తారక్‌. దీని తర్వాత కోలీవుడ్‌ దర్శకులతో సినిమాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అట్లీతో చర్చలు జరిపినట్లు ఎన్టీఆర్‌(Jr NTR) అన్నారు. అంటే ప్రశాంత్‌ నీల్‌ సినిమా తర్వాత అట్లీ సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. ‘ అట్లీ టాలెంట్‌ ఉన్న దర్శకుడు. ఆయన నాకు ఓ ఆసక్తికర రొమాంటిక్‌ కామెడీ స్టోరీ లైన్‌ చెప్పారు. లుక్‌ గురించి మేమిద్దరం చర్చించుకున్నాం. అయితే నేను, అట్లీ ఇద్దరం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండడం వల్ల అది పట్టాలెక్కలేదు. ఫ్యూచర్‌లో అట్లీతో కచ్చితంగా సినిమా చేస్తా. ఆయన ‘రాజారాణి’ సినిమాను తెరకెక్కించిన విధానం నాకెంతో నచ్చింది’ అని అన్నారు.

Jr NTR Comment

అయితే తారక్‌ ఇదే ఇంటర్వ్యూలో కోలీవుడ్‌లోని మరికొందరు దర్శకుల గురించి మాట్లాడారు. లోకేశ్‌ కనగరాజ్‌ పనితనం తనకు ఇష్టమని ఎన్టీఆర్‌ చెప్పారు. ఆయన తీసిన ‘విక్రమ్‌’ సినిమా తమిళ ఇండస్ర్టీకి గొప్ప పేరు తెచ్చిందన్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన ‘జైలర్‌’పై ఎన్టీఆర్‌ ప్రశంసలు కురిపించారు. రజనీకాంత్‌ను ఇప్పటివరకు అలాంటి పాత్రలో చూడలేదన్నారు. ఇటీవల వచ్చిన ‘రాయన్‌’లో ధనుష్‌ పాత్ర ఎంతో నచ్చిందని చెప్పారు. తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్‌ 1 ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Trisha Krishnan : మహేష్ నాకు కాలేజ్ డేస్ నుంచే తెలుసంటున్న త్రిష

CommentsJr NTRMoviesTrendingViral
Comments (0)
Add Comment