Hero Jr NTR-Vijayashanti :తండ్రి లేని లోటును తీరుస్తున్న రాముల‌మ్మ

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్

Jr NTR : ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ముఖ న‌టి విజ‌య‌శాంతిని ప్ర‌శంస‌ల‌తో కురిపించాడు. హైద‌రాబాద్ లోని శిల్ప‌క‌ళా వేదిక‌గా త‌న సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తార‌క్(Jr NTR) ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సినిమా త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవడం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. భారీ ఎత్తున హాజ‌రైన అభిమానుల‌కు మ‌రింత జోష్ తీసుకు వ‌చ్చేలా చేశాడు.

Jr NTR Emotional Reaction on Vijayashanti

త‌ను ప్ర‌స్తుతం డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రాగ‌న్ లో న‌టిస్తున్నాడు. దీనిని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇక తాజాగా త‌న సోద‌రుడు కీరోల్ పోషించిన ఈ తాజా చిత్రం ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సంద‌ర్బంగా విజ‌య‌శాంతి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ను పోషించింది రాముల‌మ్మ‌. ఆమె న‌ట‌నకు 100 మార్కులు ప‌డ్డాయి. త‌మ తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ ఇవాళ భౌతికంగా లేరు. ఆయ‌న జ్ఞాప‌కం మ‌మ్మ‌ల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంద‌న్నాడు.

ఇదే స‌మ‌యంలో త‌మ తండ్రి లేని లోటును విజ‌య‌శాంతి తీరుస్తున్నార‌ని, ఆమె సాధించిన ఫీట్స్ ను ఏ న‌టి, న‌టుడు అందుకోలేడ‌ని ప్ర‌శంసించారు జూనియ‌ర్ ఎన్టీఆర్. సినిమాకు ప్రాణం పెట్టి తీశాడు ప్ర‌దీప్ ద‌ర్శ‌కుడంటూ కొనియాడారు. న‌టుడు పృథ్వీ, త‌మ్ముడు క‌ళ్యాణ్ రామ్ అంద‌రూ త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌లో లీన‌మై న‌టించార‌ని అన్నారు. సినిమాకు సంబంధించి ఆఖ‌రి 20 నిమిషాలు క‌న్నీళ్లు పెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. ఫుల్ ధీమా వ్య‌క్తం చేయ‌డం మ‌రింత బ‌లాన్ని ఇచ్చేలా చేసింది మూవీ టీంకు.

Also Read : Hero Nani -Hit 3 :మే1న రిలీజ్ కానున్న నాని హిట్-3

Jr NTRNandamuri Kalyan RamUpdatesVijayashantiViral
Comments (0)
Add Comment