Jr NTR : దేవర సక్సెస్ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ నెక్ట్స్ లైనప్ కూడా సో స్ట్రాంగ్ అనేలా ఉంది. ప్రజెంట్ బాలీవుడ్ డైరెక్టర్‌తో వార్ 2 షూట్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్, ఆ తరువాత కూడా వరుసగా పరభాషా దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR), వరుసగా అదే రేంజ్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు. ప్రజెంట్ బాలీవుడ్ స్పై సిరీస్‌లో తెరకెక్కుతున్న వార్ 2లో నటిస్తున్నారు తారక్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
Jr NTR Movies Update
వార్2 పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా కోసం తన స్టైల్ మార్చి కొత్త జానర్ ట్రై చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమా తరువాత కూడా పరభాష దర్శకులతోనే ఎన్టీఆర్ సినిమాలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. తారక్‌తో సినిమా చేసేందుకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అట్లీ, వెట్రిమారన్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. డేట్స్ కుదిరితే వీటిలో ఏదో ఒక కాంబో నెక్ట్స్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. ఇమిడియట్‌గా కాకపోయినా.. వీలైనంత త్వరగా ఈ కాంబోస్‌ను సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు. ట్రిపులార్,దేవర సినిమాల తరువాత ఎన్టీఆర్ ఇమేజ్, మార్కెట్ భారీగా పెరిగిపోయాయి. అందుకే నెక్ట్స్ మూవీస్‌ని అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు తారక్. అందుకోసం బార్డర్స్ క్రాస్ చేసి పరభాషా దర్శకులను లైన్‌లో పెడుతున్నారు.
Also Read : SSMB29 Movie : మహేష్, రాజమౌళి సినిమాపై మరో అఫీషియల్ అప్డేట్