John Abraham: జూలై 12న జాన్‌ అబ్రహాం ‘వేదా’ !

జూలై 12న జాన్‌ అబ్రహాం 'వేదా' !

John Abraham: బాలీవుడ్‌ స్టార్ హీరో జాన్‌ అబ్రహాం నటించిన తాజా యాక్షన్‌ మూవీ ‘వేదా’. 2007లో విడుదలైన ‘సలామ్‌ ఏ ఇష్క్‌’ వంటి సూపర్ హిట్‌ మూవీ తర్వాత హీరో జాన్‌ అబ్రహాం, దర్శకుడు నిఖిల్‌ అద్వానీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో జాన్ అబ్రహాం సరసన శార్వరీ వాఘ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ పతాకంపై మోనీషా అద్వానీ, మధు భోజ్వాని, జాన్‌ అబ్రహాం(John Abraham) నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసి… పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు మూవీ మేకర్స్.

John Abraham Movie Updates

వాస్తవ ఘటనల స్ఫూర్తితో… యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ‘వేదా’ ను జూలై 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు రిలీజ్ డేట్ తో కూడిన ఓ ఆశక్తికరమైన పోస్టర్ ను కూడా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. సినిమా టైటిల్, ఇతర వివరాలను ప్రస్తావించకుండా తన అద్భుతమైన చిత్రంతో ఆయన టీజర్ పోస్టర్‌లో, అతను తన వీపును చూపుతూ ఓ చేతిలో గన్ తో.. వీపుకి మరో పెద్ద గన్ ను తగిలించి కనిపించాడు హీరో జాన్ అబ్రహాం. ప్రస్తుతం జాన్ అబ్రహం ‘వేదా’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు నిఖిల్ అద్వానీ… ‘వేదా’ రిలీజ్ డేట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ…. ‘‘యాక్షన్‌ డ్రామాగా ‘వేదా’ రూపొందింది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తీశాను. ఈ మూవీ మన సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబిస్తుంది’’ అని నిఖిల్‌ అద్వానీ పేర్కొన్నారు. మరోవైపు ”ఆమెకు రక్షకుడు కావాలి. ఆమెకు ఆయుధం దొరికింది” అని పోస్టర్‌ తో పాటు ఈ క్యాప్షన్ ను తన సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేసాడు హీరో జాన్ అబ్రహాం.

Also Read : Vennela Kishore: గూఢచారిగా వస్తున్న వెన్నెల కిశోర్ !

John AbrahamVeda
Comments (0)
Add Comment