Jigarthanda Double X: రోటర్‌డ్యామ్‌ ఫెస్టివల్‌కు ‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్‌’

రోటర్‌డ్యామ్‌ ఫెస్టివల్‌కు ‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్‌’

Jigarthanda Double X: కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్‌’ కు అరుదైన గౌరవం దక్కింది. రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా… రోటర్‌డ్యామ్‌ 50వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైంది. ఇదే విషయాన్ని చిత్ర దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు తన సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ‘మా ‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్‌’ చిత్రం ప్రతిష్ఠాత్మక రోటర్‌డ్యామ్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో లైమ్‌లైట్‌ కేటగిరీ కింద ప్రదర్శించడానికి ఎంపికైందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు.

క్రైమ్‌ నేపథ్యంలో సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు.. నిజమైన గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడనే నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఇందులో దర్శకుడిగా సూర్య, గ్యాంగ్‌స్టర్‌గా రాఘవ లారెన్స్ ప్రేక్షకులను మెప్పించారు.

Jigarthanda Double X – రోటర్ డ్యామ్ ఫెస్టివల్ లో సందడి చేయనున్న ‘ఏళు కడై.. ఏళుమలై’

అలాగే ఈ రోటర్‌డ్యామ్‌ 50వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు మరో తమిళ సినిమా కూడా ఎంపికైయింది. అంజలి, నివిన్ పాలీ నటించిన ‘ఏళు కడై.. ఏళుమలై’ సినిమా కూడా ఈ రోటర్‌డ్యామ్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో బిగ్‌ స్క్రీన్ కేటగిరీలో ప్రదర్శనకు ఎంపికైంది. ఇదే విషయాన్ని అంజలి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్‌ చేసింది. దీనితో ‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్‌(Jigarthanda Double X)’, ‘ఏళు కడై.. ఏళుమలై’ చిత్ర యూనిట్లకు నెటిజన్లు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ రోటర్‌డ్యామ్‌ 50వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వేడుక నెదర్లాండ్స్ లోని రోటర్ డ్యామ్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరగనుంది. స్వతంత్ర మరియు ప్రయోగాత్మక చిత్రాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్ ( IFFR ) అనేది 1972 నుండి ప్రతీ ఏటా నిర్వహించబడుతోంది.

Also Read : Hrithik Roshan: దీపికాతో హృతిక్ రొమాన్స్ !

Jigarthanda Double Xraghava lawrencesj surya
Comments (0)
Add Comment