Jennifer Lopez: నాలుగో భర్తకు కూడా జెన్నిఫర్ లోపెజ్ గుడ్ బై ?

నాలుగో భర్తకు కూడా జెన్నిఫర్ లోపెజ్ గుడ్ బై ?

Jennifer Lopez: హాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్‌ జెన్నిఫర్ లోపెజ్ తన భర్తతో విడిపోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2022లో బెన్ అఫ్లెక్‌ ను పెళ్లాడిన నటి త్వరలోనే తమ బంధానికి గుడ్‌ బై చెప్పనున్నట్లు హాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్‌లోని ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. తాజాగా ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట డైవర్స్‌ తీసుకోబోతున్నట్లు రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

Jennifer Lopez..

కాగా.. ఇప్పటికే జెన్నిఫర్‌ లోపెజ్ ముగ్గురి పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు. బెన్ అఫ్లెక్ ఆమెకు నాలుగో భర్త కాగా… ఈ బంధానికి ఎండ్‌ కార్డ్‌ పడడం ఖాయంగా కనిపిస్తోంది. 2021లో డేటింగ్‌ ప్రారంభించిన వీరిద్దరు… ఆ తర్వాత 2022లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహాబంధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గత నెల రోజులుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు సమాచారం. బిజీ షెడ్యూల్‌ కారణంగానే వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

Also Read : Adah Sharma: అరుదైన వ్యాధి బారిన పడిన మరో టాలీవుడ్ బ్యూటీ !

Ben AffleckJennifer Lopez
Comments (0)
Add Comment