Jayasudha: సహజనటి గా దక్షిణాది భాషల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి జయసుధ. ఎన్టీఆర్, ఏఎన్నార్, రజనీకాంత్, కమల్ హాసన్, శోభన్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించిన జయసుధ(Jayasudha)… అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయితే అనూహ్యంగా 2017లో తన భర్త, నిర్మాత నితిన్ కపూర్… తమ అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ఆది దంపతులు’, ‘కలికాలం’, ‘హ్యాండ్సప్’, ‘మేరా పతి సిర్ఫ్ మేరా హై’, ‘వింత కోడళ్లు’ తదితర చిత్రాలను నిర్మించిన నితిన్ కపూర్… అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అనే ప్రచారం జరిగింది. అంతేకాదు దానికి జయసుధ కారణమంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. అయితే ఇది జరిగి దాదాపు ఏడేళ్ళ తరువాత జయసుధ మొట్టమొదటి సారిగా స్పందించారు. ఆ ఘటనకు తాను బాధ్యురాలిని కాదని స్పష్టం చేసారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Jayasudha Comment
నితిన్ కపూర్-జయసుధల తనయుడు నిహర్ కపూర్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘రికార్డు బ్రేక్’. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 8న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘రికార్డు బ్రేక్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ డిజిటల్ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలు తన భర్త ఆత్మహత్యపై నటి జయసుధ స్పందించారు. ‘అప్పుల బాధ తట్టుకోలేక నితిన్ చనిపోయారు. దానికి జయసుధ కారణమంటూ అప్పట్లో వార్తలొచ్చాయి’ అని హోస్ట్ ప్రస్తావించగా… దానికి జయసుధ(Jayasudha) సమాధానం ఇస్తూ… ‘‘సినిమా వాళ్ల విషయంలో కొందరు తమకు ఏది అనిపిస్తే అది రాసేస్తుంటారు. నిజం తెలుసుకోరు. మాకు అప్పులు లేవు. వాటిని తీర్చలేక ఆయన సూసైడ్ చేసుకున్నారనేది నిజం కాదని ఆమె స్పష్టం చేసారు.
అంతేకాదు నితిన్ కంటే ముందు అతని సోదరుడు, వారి బంధువులైన ఇద్దరు మహిళలు కూడా ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఎప్పుడో ఒకప్పుడు నితిన్ కు ఇలా జరుగుతుందని మేము అనుకున్నాం. నేను, మా అత్తగారు వాళ్లు దాన్ని ఆపేందుకు ఎంతగానో ప్రయత్నించాం. కానీ, ఆయన్ను కాపాడుకోలేకపోయాం. ఇది నితిన్ కుటుంబానికి ఓ శాపం అనుకుంటున్నాము. కనీసం రాబోయేతరాలకు ఈ పరిస్థితి ఉండకూడదని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. నితిన్ లేరన్న బాధ నుంచి కోలుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. ఆ సమయంలో ఫ్యామిలీ సపోర్ట్ గా నిలిచింది’’ అని అన్నారు. దీనితో జయసుధ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా కాగా… నితిన్ కపూర్ ఆత్మహత్య విషయం మరోసారి వెలుగులోనికి వచ్చింది.
Also Read : Bastar The Naxal Story: ఐపీఎస్ నీరజా మాధవన్ గా యాక్షన్ లోకి దిగిన అదాశర్మ !