Jayamalini: సిల్క్‌ స్మిత బలవన్మరణంపై జయమాలిని సంచలన వ్యాఖ్యలు !

సిల్క్‌ స్మిత బలవన్మరణంపై జయమాలిని సంచలన వ్యాఖ్యలు !

Jayamalini: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో స్టార్ డమ్ అనుభవించి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించిన వారిలో శృంగార తార సిల్క్‌ ఒకరు. సినిమాలపై ఆశక్తితో మారుమూల గ్రామం నుండి వచ్చి శృంగార తారగా నిలదొక్కుకుని… స్టార్ హీరోలకు ధీటుగా స్టార్ డమ్ ను సాధించింది సిల్క్ స్మిత. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులను చూసిన సిల్క్ స్మిత… అనూహ్యంగా 35 ఏళ్ల వయసులోనే 1996లో ఆత్మహత్య చేసుకుంది. అయితే సిల్క్ స్మిత బలవన్మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అయితే సిల్క్ స్మిత మరణంపై ఆమె సహనటి జయమాలిని ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో కీలక విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం జయమాలిని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Jayamalini Comment

ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో నటి జయమాలిని(Jayamalini) మాట్లాడుతూ… ‘క్షణికావేశం, విరక్తి.. మనిషి జీవితాన్ని కోల్పోవడానికి కారణం అవుతుంటాయి. మరి ఏమైందో ఏమో గానీ శృంగార తార సిల్క్‌ స్మిత అప్పట్లో ఇలానే బలవన్మరణానికి పాల్పడింది. అతి తక్కువ కాలంలోనే పేరు, ప్రఖ్యాతలతో పాట డబ్బు సంపాదించిన నటి సిల్క్‌ స్మిత. షూటింగ్‌ స్పాట్‌ లో ఆమె నాతో మాట్లాడేదే కాదు. ఓ సినిమాలో హీరోతో కలిసి నేను, మా అక్క జ్యోతిలక్ష్మి, సిల్క్‌ స్మిత నటించాం. అయితే మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే సిల్క్‌ స్మిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. అది ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ‘ప్రేమించడం తప్పు కాదు కానీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండకూడదు.

ఎందుకంటే సిల్క్‌ స్మిత… ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మేసింది. అతడు మోసం చేశాడు. ఒకవేళ తల్లిదండ్రులు పక్కనుంటే బాధలో అండగా ఉండేవారు. సొంతవాళ్లు లేకపోతే చాలామంది మోసం చేయడానికి రెడీగా ఉంటారు. అలానే సిల్క్‌ స్మిత బలైపోయింది’ అని జయమాలిని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయాయి.

Also Read : Prithiveeraj : పెళ్లి కాకుండా సహజీవనం లో ఉండి విడిపోయామంటున్న శీతల్

JayamaliniSilk Smitha
Comments (0)
Add Comment