Jawan Movie : షారుక్ మూవీ క‌లెక్ష‌న్ల సునామీ

జ‌వాన్ రికార్డుల మోత

Jawan Movie : అంచ‌నాల‌కు మించి అద్భుత‌మైన ఆద‌ర‌ణ చూర‌గొంటోంది అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ మూవీ. రిలీజ్ కాకుండానే రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి విస్తు పోయేలా చేసింది. ప్ర‌స్తుతం విడుద‌ల‌య్యాక రికార్డుల మోత మోగిస్తోంది. సెప్టెంబ‌ర్ 7న గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం విచిత్రంగా ఏకంగా తొలి రోజే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Jawan Movie Talk

ట్రేడ్, సినీ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ఏకంగా రూ. 72 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది జ‌వాన్ మూవీ. ఇటు ఇండియాలో అటు ఓవ‌ర్సీస్ లో దుమ్ము రేపుతూ దూసుకు పోతోంది. ఒక్క హిందీలోనే రూ. 60.76 కోట్లు వ‌సూలు అయ్యాయి. త‌మిళంలో రూ. 6.41 కోట్లు రాగా తెలుగులో రూ. 5.29 కోట్లు వ‌చ్చాయి. ఓవ‌ర్ ఆల్ గా రూ. 100 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసిన‌ట్లు సినీ వ‌ర్గాల అంచ‌నా.

సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం జ‌వాన్(Jawan Movie) ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. ప్ర‌త్యేకించి యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ తీసిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డం . బాద్ షా షారుక్ ఖాన్ త‌న‌లో ఇంకా స్టామినా ఉంద‌ని నిరూపించాడు. ఆయ‌న‌కు పోటీగా న‌టించిన న‌య‌న‌తార వంద మార్కులు కొట్టేసింది.

ఇక స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ లో దీపికా ప‌దుకొనే దుమ్ము రేపితే ప్ర‌తి నాయ‌కుడిగా విజ‌య్ సేతుప‌తి త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. ఇక మ్యూజిక్ ప‌రంగా అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యాజిక్ చేశాడు. మొత్తంగా జ‌వాన్ రూ. 1,000 కోట్లు దాటినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌ని లేదు.

Also Read : Shah Rukh Khan : బాద్ షా క‌మాల్ జ‌వాన్ బ్లాక్ బ‌స్ట‌ర్

Comments (0)
Add Comment